YCP Senior Leader Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డ నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారనుకుంట: సజ్జల

గన్నవరం వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కోసం పని చేయాలన్నారు. తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ ఇలా బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోందని అన్నారు సజ్జల.

YCP Senior Leader Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డ నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారనుకుంట: సజ్జల
New Update

Sajjala Ramakrishna Reddy Reacts on Yarlagadda Venkata Rao Comments: గన్నవరం వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కోసం పని చేయాలన్నారు. తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ ఇలా బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోందని అన్నారు సజ్జల.

మీరు బయట మాట్లాడకపోతే రియాక్షన్ ఇలా వచ్చి ఉండేది కాదన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను బట్టి వారు నిర్ణయం తీసుకుంటారని అప్పుడూ చెప్తున్నాం.. ఇప్పుడూ చెప్తున్నామన్నారు. ఎమ్మెల్యే అయితేనే అంటే ఎలా.. పదవి లేకపోతే పార్టీ వ్యవహారాలు చూడొచ్చు.. పదవి రాకపోతే నిరాదరణకు గురైనట్టు భావించి బహిరంగంగా చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఒక్కసారి తాను తప్పుకుంటాను అని చెప్పాక ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వ్యక్తిగతమే అన్నారు. దాని గురించి మాట్లాడడం అనవసరమన్నారు. సీఎం జగన్ ను కలవాలంటే ప్రోపర్ వే ఉంటుందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

యార్లగడ్డ వెంకట్రావు ఏమన్నారంటే.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. సీఎం జగన్ ను టిక్కెట్ ఇవ్వాలని మాత్రమే అడిగానని తెలిపారు. పార్టీ పెద్దలకు ఏం అర్థమైందో ఏమో తనకు తెలియలేదని చెప్పారు. తనను ఎక్కడైనా పార్టీ సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు యార్లగడ్డ. కానీ పార్టీలో ఉంటే ఉండు.. పోతే పొమ్మని సజ్జల చెప్పడంతో తనకు చాలా బాధ, ఆవేదన కలిగాయని అన్నారు. టీడీపీ కంచుకోటలో తాను ఢీ అంటే ఢీ అని పోరాడానని గుర్తు చేశారు యార్లగడ్డ.

తడి గుడ్డతో గొంతు కోయడం అనేది తన విషయంలో నిజమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన మనిషిని కాపాడాల్సిన బాధ్యత ఏ పార్టీకైనా ఉంటుందని అన్నారు. తాను ఇంతవరకు చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలను కలవలేదని చెప్పారు. తాను టీడీపీ నేతలను కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబును కలవబోతున్నానని ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు.

#ycp #comments #yarlagadda-venkata-rao #sajjala-ramakrishna-reddy #ycp-senior-leader-sajjala-ramakrishna-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe