YCP Senior Leader Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డ నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారనుకుంట: సజ్జల
గన్నవరం వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కోసం పని చేయాలన్నారు. తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ ఇలా బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోందని అన్నారు సజ్జల.