Yarlagadda Venkata Rao Sensational Comments: పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా: యార్లగడ్డ
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఇరువురూ కొద్దిసేపు చర్చలు జరిపారు. ఈ నెల 22న గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం యార్లగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశానన్నారు యార్లగడ్డ.