YCP Reaction: జైల్‌కి వెళ్ళింది అందుకే..జనసేనానిపై వైసీపీ విమర్శనాస్త్రాలు..!!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. జనసేన- టీడీపీ కలిసి పోటీచేస్తాయని రాజమండ్రి జైలులో జనసేనాని డిక్లేర్ చేశారు. అయితే, ఈ రెండు పార్టీల పొత్తుపై వైసీపీ విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది. “ప్యాకేజ్ బంధం బయటపడింది”అంటూ కౌంటర్ ఇచ్చింది.

New Update
YCP Reaction: జైల్‌కి వెళ్ళింది అందుకే..జనసేనానిపై వైసీపీ విమర్శనాస్త్రాలు..!!

YCP Reaction on Janasena-TDP Alliance: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. జనసేన- టీడీపీ కలిసి పోటీచేస్తాయని రాజమండ్రి జైలులో జనసేనాని పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ (YSRCP) విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది. “ప్యాకేజ్ బంధం బయటపడింది”అంటూ కౌంటర్ ఇచ్చింది. ‘నువ్వు రాజ‌మండ్రి సెంట్రల్ జైల్‌కి వెళ్ళింది టీడీపీ (TDP)తో పొత్తును ఖాయం చేసుకునేందుకనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందని. . ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మకం పెట్టుకున్న అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమ‌లు తొల‌గించేశావుని..ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ.. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం అని అని వైసీపీ స్పష్టం చేసింది.

ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి లా లేదు..?

జనసైనికులూ..ఆలోచించండి..ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి లా లేదు..ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మేపిచ్చోళ్ళు ఎవరూ లేరు కళ్యాణ్‌ బాబు! అంటూ మంత్రి అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. ఎప్పుడో అయ్యాడు.. ఇప్పుడేముంది కొత్తగా ములాఖ‌త్ అని ట్వీట్ చేశారు.

పవన్‌.. బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం..!

చంద్రబాబు (chandrababu)కు దత్తు పుత్రుడుని పవన్‌ రుజువు చేశాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దత్త తండ్రి అరెస్ట్‌ను పవన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్ట్‌ చేయడం సిగ్గుచేటు. బాబు చేసిన అవినీతిలో పవన్‌, బాలకృష్ణకి వాటా ఉందా?. చందబ్రాబు ఒక ఆర్థిక నేరస్తుడు. పవన్‌.. బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం చేస్తున్నాడు. చందబ్రాబు కోసమే పవన్‌ జనసేన పార్టీ పెట్టాడు’’ అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు.

పొత్తు ఫిక్స్ : పవన్

టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈరోజు జరిగిన ములాఖత్ ఆంధ్రపద్రేశ్ కు చాలా అవసరమని జనసేనాని పవన్ చెప్పారు. తాను ఎన్డీయేలో ఉన్నానని, అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని.. ఇదే విషయాన్ని బీజేపీ హైకమాండ్ కు కూడా చెప్పానని, వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేనది తనకు తెలియదని చెప్పారు. ఈరోజు తాను ఒక విషయాన్ని అందరికీ స్పష్టంగా చెపుతున్నానని, 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానని అన్నారు.

ఇప్పటి వరకు పొత్తుల గురించి ఆలోచన మాత్రమే చేశానని, ఇప్పుడే పొత్తుపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ అరాచకాలను అడ్డుకోలేమని అన్నారు. జగన్ కు ఇక మిగిలింది కేవలం 6 నెలలు మాత్రమేనని చెప్పారు. ఈ నిర్ణయం ఈ రెండు పార్టీల మేలు కోసం తీసుకున్నదని కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నదని చెప్పారు. మీరు యుద్ధమే కోరుకుంటే.. యుద్ధానికి తాము సిద్ధమని చెప్పారు. రేపటి నుంచి టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

Also Read:  వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయి: పవన్

Advertisment
Advertisment
తాజా కథనాలు