MLC Ramachandraiah Joins TDP: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీకి (YSRCP) షాకులు ఇస్తన్నారు సొంత పార్టీల నేతలు. టికెట్ రానందుకు, పార్టీలో గుర్తింపు లేదని మరికొందరు ఇలా ఒకరి తరువాత మరొకరు వైసీపీ రాజీనామా చేస్తున్నారు. ఈ రాజీనామాల పర్వం ఇంకా కొనసాగుతుంది. సొంత పార్టీ నేతల రాజీనామాతో సీఎం జగన్ (CM Jagan) గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ( మంగళవారం) వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, లిస్ట్ వచ్చిన తరువాత మరో వైసీపీ నేత రాజీనామాకు సిద్ధమయ్యారు.
ALSO READ: తెలంగాణలో 26మంది ఐఏఎస్ ల బదిలీలు..
చంద్రబాబు ని (Chandrababu) ఆయన నివాసంలో కలిసి తెలుగుదేశం లో చేరేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం కు వెళ్లారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవు అని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై జగన్ కు చెప్పినా వినే పరిస్థితి లేదు అని పేర్కొన్నారు. నాలాగే వైసీపీ లో ఎంతో మంది ఉన్నారని, సమయానుకూలంగా బయటకు వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం లో చేరేందుకే చంద్రబాబు ను కలిసినట్లు స్పష్టం చేశారు. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య..
ఈ రోజు మంగళగిరిలో మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాజీ మంత్రి వర్యులు దాడి వీరభద్రరావు గారు యువనాయకులు దాడి రత్నాకర్, దాడి జయవీర్ టీడీపీ లో చేరారు. ఈ సందర్బంగా వారిని కండువా వేసి పార్టీలోకి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.
ALSO READ: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్?