గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు వస్తున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామ వాలంటరీల పనితీరు ఎలాగా ఉంది..? అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని సమస్యల గురించి స్థానిక ప్రజలతోనూ మరియు గ్రామ నాయకులతోనూ ఎమ్మెల్యే మేకపాటి అడిగి తెలుసుకున్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం
అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీగా తమ ప్రభుత్వంపై ప్రజల మద్దతుతో 175 కు 175 సీట్లు గెలిచి తీరుతామని ప్రతిపక్షంకు సున్నా కూడా రాదని సున్నాలు సున్నాలు ఎన్ని కలిసినా.. చివరికి సున్నాలుగానే ఉంటాయని అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటిలోని ప్రజల ఆరోగ్యం తెలుసుకొని వారికి అవసరమైన వైద్య సేవలు అందించే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో మేలుగా ఉందని అన్నారు. అలాగే అమెజాన్ డోర్ డెలివరీ తరహాలో ఒక్క ఫోన్ కాల్‌తో ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేరుస్తున్న ప్రభుత్వం తమదేనని ఇటువంటి విధి విధానాలు ప్రపంచంలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే మేకపాటి అన్నారు.
అమెజాన్ డోర్ డెలివరీ తరహాలో..
సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని పలు మార్లు ముఖ్యమంత్రి తాడేపల్లిలో సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదనే భావనలో సీఎం ఉన్నారు. అయితే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని లబ్దిదారులకు వివరించాలని పదేపదే సీఎం జగన్ సూచించారు. ఇదిలాంటే తమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారి ఆశీర్వాదంతో తిరిగి తాము గెలుస్తామని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధంగానే వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలుస్తామని ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తంశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక నాయకులు, మండల నాయకులు, అధికారులు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: తిరుపతిలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. భారీగా ఎర్రచందనం స్వాధీనం