Red Sanders Smugglers in AP: తిరుపతిలో (Tirupati) టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 మంది తమిళనాడుకు (Tamilnadu) చెందిన స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు మూడు వాహనాల సీజ్ చేశారు. లక్షల విలువైన 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం. తిరుపతి జిల్లాలోని రెండు వేర్వేరు ఘటనలో 25 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లా రెడ్డివారిపల్లి ఫారెస్ట్ పరిధిలోని పెద్దకోనవంక దగ్గర ఘటన జరగగా.. కర్నూలు జిల్లా చాగలమర్రి దగ్గర మరో ఘటన చోటుచేసుకుంది. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. గురువారం నాడు మూడు వాహనాలు రావడంతో సిబ్బందిని ఆపేశారు. వాహనాలను తనిఖీ చేయగా 21 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాహనంతోపాటు లక్షలు విలువ చేసే ఎర్రచందనం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..AP Smugglers: తిరుపతిలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. భారీగా ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ ఫారెస్ట్‌లో అక్రమాలకు పాల్పుడుతున్నారు. పక్క సమాచారంలో రెండు ప్రాంతాలలో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడుతుకు చెందిన పలువురి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
Translate this News: