AP Politics: ఆరోగ్యశ్రీకి 25 లక్షలు తాత, అవ్వలకు 3వేలు..జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఈరోజు ఏపీ కేబినెట్ లో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షలకు పెంచడంతో పాటూ తాత, అవ్వలకు ఇచ్చే పింఛను 3 వేల రూపాయలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

New Update
AP Politics: ఆరోగ్యశ్రీకి 25 లక్షలు తాత, అవ్వలకు 3వేలు..జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం అమరావతిలోని సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జనవరి నెల నుంచి రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. చాంగ్ తుఫాన్ పంట నష్టం, పరిహారం పై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇంకా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షల పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూకేటాయింపులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది.

Also read:టీడీపీకి షాక్…పాలిటిక్స్ కు గల్లా గుడ్ బై!

వీటితో పాటూ విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాల మీద జగన్ మాట్లాడనున్నారు. అభ్యర్థులు, ఇంచార్జిల మార్పుల పై మంత్రులతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం 45 అంశాలతో కేబినెట్ ఎజెండా రూపొందించారు. ఈ సమావేశంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కు ఆమోదం తెలపనుంది కేబినెట్. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుందని సమాచారం. మిచాంగ్ తుఫాన్ నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు