YCP : అరెస్ట్ తథ్యం!.. కోర్టుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. కోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

New Update
YCP : అరెస్ట్ తథ్యం!.. కోర్టుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ

Vallabhaneni Vamsi Mohan : వైసీపీ (YCP) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టు (AP High Court) ను ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న ఆయన.. తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఇచ్చే తీర్పుపై వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ కేసులో ఇప్పటికే వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేయగా.. వంశీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రేరణతోనే గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు ఆయన అనుచరులే పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో వంశీని పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.

అరెస్ట్ చేశారనే ప్రచారం...

టీడీపీ కార్యాలయం దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారని ప్రచారం జరిగింది. వంశీ అరెస్ట్ పై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు ఎన్నికల్లో ఓటమి చెందిన వంశీ గత కొన్ని రోజులుగా ప్రజల్లో లేరు. ఆయన ఎక్కడ ఉన్నారనే ఆచూకీ కూడా ఎక్కడ తెలియలేదు. దీంతో వంశీ అరెస్ట్ అయ్యారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లైంది. కాగా జరుగుతున్న ప్రచారం పై ఆలస్యంగా పోలీస్ శాఖ స్పందించింది. వంశీని అరెస్ట్ చేయలేదని పేర్కొంది. టీడీపీ అధికారంలో ఉండడంతో తన అరెస్ట్ తధ్యమని భావించిన వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు.

Also Read : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మన ఒలింపిక్ క్రీడాకారులు..

Advertisment
తాజా కథనాలు