Olympic Players: పారిస్ ఒలింపిక్స్ ముగియడంతో ఈ మహా క్రీడా సంగ్రామంలో పాల్గొనేందుకు వెళ్లిన క్రీడాకారులు తమ తమ దేశాలకు బయలుదేరారు. భారత ఒలింపిక్ ఆటగాళ్ల బృందం కూడా స్వదేశానికి బయలుదేరింది. ఈరోజు ఢిల్లీ చేరుకుంటుంది. రేపు అంటే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జరిగే వేడుకల్లో భారత ఆటగాళ్ల బృందం పాల్గొంటుంది. ఆ తర్వాత వీరంతా ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. భారత ఒలింపిక్ బృందం బుధవారం ఉదయం పారిస్ నుంచి ఢిల్లీ చేరుకుంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు హై టీ కోసం ఈ ఆటగాళ్లను కలవనున్నారు. ఆగస్టు 15వ తేదీ గురువారం ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారు. దీని తర్వాత ఆటగాళ్లు ప్రధానమంత్రి అధికారిక నివాసానికి వెళతారు. ప్రధాని నరేంద్ర మోడీ వీరితో మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ సమావేశమవుతారు.
పూర్తిగా చదవండి..Olympic Players: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మన ఒలింపిక్ క్రీడాకారులు..
భారత ఒలింపిక్ క్రీడాకారులు ఈరోజు ఢిల్లీ చేరుకుంటారు. ఈ సాయంత్రం క్రీడాకారులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంటే ఆగస్టు 15న ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం వీరు ప్రధాని మోదీని కలుస్తారు.
Translate this News: