Alla Ramakrishna Reddy: ఇటీవల తన రాజీనామాతో సీఎం జగన్ కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాను షర్మిల బాటలో నడుస్తానని గతంలో ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గతంలో చెప్పినట్టుగానే వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ షర్మిల.
ALSO READ: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
వ్యక్తిగత కారణాల వల్లే..
ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీకి పదవికి రాజీనామా చేసి రాజకీయ అలజడిని సృష్టించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy). అయితే.. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యే పదవికి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు. రాజీనామా అనంతరం ఆళ్ల మాట్లాడుతూ.. రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసే అవకాశం కల్పించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. నీతి నిజాయితీతో ధర్మంగా శాసనసభ్యుడిగా పనిచేశానన్నారు. ఒక వైపు బాధగా ఉన్నప్పటికీ.. కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
ఇన్నాళ్లు తనకు రాజకీయంగా అవకాశం కల్పించినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి (AP CM Jagan) ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి కోసం పనిచేశానన్నారు. 2004లో కాంగ్రెస్ నుంచి సత్తెనపల్లి టికెట ఆశించి భంగపడ్డనని గుర్తు చేశారు. తర్వాత 2009 లో పెదకూరపాడు టికెట్ ను ఆశించినా.. దక్కలేదన్నారు.
ALSO READ: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా?
అయినా.. కాంగ్రెస్ పార్టీ కోసమే పని చేశానన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ తో ఉన్నానన్నారు. 2014 నుంచి 19 వరకు.. తర్వాత 2019 నుంచి ఇప్పటివరకు వైసీపీ నుంచి మంగళగిరిలో ఎమ్మెల్యేగా పని చేసే అవకాశాన్ని జగన్ కల్పించారన్నారు.
DO WATCH: