Anil Kumar Yadav: సీఎం జగన్ (CM Jagan) ఏది చెప్తే అదే నాకు శిరోధార్యం అని అన్నారు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav). జగనన్న వల్లనే అనిల్ గా రాష్ట్రంలో దేశంలో ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. సీఎం జగన్ ఎక్కడకి వెళ్ళి పోటీ చేయమంటే అక్కడకు వెళ్తా అని స్పష్టం చేశారు. రెండు సార్లు ఎమ్మల్యేను చేశారు.. మంత్రిని చేశారు. నా గుర్తింపు జగన్ భిక్ష అని వ్యాఖ్యానించారు.
ALSO READ: ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ
నరసరావుపేట నుంచి పోటీ చేస్తా..
జగన్ ఆదేశిస్తే నరసరావుపేట (Narasaraopeta).. మరెక్కడ నుంచైనా పోటీ చేస్తానని అన్నారు అనిల్ కుమార్. నెల్లూరీయులను ఇప్పటికే రెండు సార్లు పల్నాడు వాసులు గెలిపించారని పేర్కొన్నారు. జిల్లా చరిత్ర లో 75 ఏళ్ల తర్వాత నెల్లూరు లో ఒక బీసీ కి సీటు ఇచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇదే 75 ఏళ్ల తర్వాత పల్నాడు నరసరావుపేట లో ఒక బీసి కి అవకాశం ఇచ్చి మరో సారి చరిత్ర రాస్తున్నారని అన్నారు.
బాబు చరిత్ర పార్లమెంట్ లో వినిపిస్తా..
ఇప్పటి వరకు ఏపీలో బాబు (Chandrababu).. ఆయన కొడుకును తిట్టానని అన్నారు అనిల్. నరసరావుపేట ప్రజలు దీవిస్తే ఢిల్లీ లో ఏపీ గొంతుక వినిపిస్తా అని తెలిపారు. చంద్రబాబు చరిత్ర పార్లమెంట్ లో వినిపిస్తా అనిపేర్కొన్నారు. చంద్రబాబు దగ్గర ఉంటే సంసారం పక్కకు వెళ్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. జగనన్న సింహ గర్జన సిద్ధం తో ఎన్నికల శంఖారావం అని అన్నారు. స్వతంత్రం వచ్చాక ఎవరూ చేయని విధంగా సంస్కరణలను సీఎం జగన్ చేసారని అన్నారు.
ఏకైక నాయకుడు జగన్..
సంపన్నుల పక్కన బాబు, బక్కచిక్కిన వారి పక్కన జగన్ అని అన్నారు అనిల్. ఒక్క జగన్ ను ఢీ కొనేందుకు ప్రతిపక్షాలు ఒక్కటవుతున్నాయని పేర్కొన్నారు. ఏపీ రాజకీయ చరిత్ర లో మంచి చేసి ఉంటే దీవించండి అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అని కొనియాడారు. 2014, 2019 లో టికెట్ రాకున్నా పార్టీని నమ్ముకుని వుండడం వల్లే ఇవాళ మేరిగ మురళీధర్ గూడూరు ఎమ్మేల్యే అభ్యర్థి అయ్యాడని అన్నారు.
DO WATCH: