Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం

ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.

New Update
Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం

CM YS Jagan Bus Campaign : మేమంతా సిద్ధం అంటూ బయలుదేరుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan). మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల సమరానికి శంఖారావం పూరిస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ బస్సులో రాష్ట్రమంతా తిరగనున్నారు. ప్రజలను నేరుగా కలిసి వారితో ముచ్చటించనున్నారు. ఈరోజు కడపలోని ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర మొదలవుతుంది. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇడుపులపాయకు వైఎస్ఆర్ ఘాట్, గెస్ట్ హౌస్ తదితర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో పాటూ సీఎం జగన్ పర్యటించే బస్సును కూడా సిద్ధం(Siddham) చేసారు పార్టీ ముఖ్య నాయకులు.

తండ్రి ఘాట్ నుంచి మొదలు..

ఇక మేమంతా సిద్ధానికి సీఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం ఇడుపులపాయ(Idupulapaya) కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:20 గంటలకు కడప ఎయిర్ పోర్టు(Kadapa Airport) కు వస్తారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 12:45కు ఇడుపులపాయకు చేరుకోనున్నారు. దాని తర్వాత తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ దగ్గర నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1.30నిమిషాలకు మేమంతా సిద్ధం బస్సు యాత్రను జగన్ ప్రారంభిస్తారు.

రాత్రికి ఆళ్లగడ్డలో బస..
ఇడుపులపాయ నుంచి మొదలై కుమారునిపల్లె, వేంపలెల, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లె, గంగిరెడ్డిపల్లె, ఊరుటూరు, యర్రగుంట్ల, పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని...అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సభ తర్వాత సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

Also Read : Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు

Advertisment
Advertisment
తాజా కథనాలు