సాకేంతిక రంగంలో రోజురోజుకు మార్పులు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యుగంలో.. సంబంధిత సంస్థలు తమ యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను అనుసరిస్తుంటాయి. అలాగే కంపెనీల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా.. గతేడాది ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం అనేక మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకనుంచి ఎక్స్ (ట్విట్టర్)లో ఆడియో, వీడియోకాల్ సౌకర్యాన్ని అందించనున్నారు. ఇప్పటికే మెటా ఆధ్వర్యంలో ఉన్న వాట్సాప్‌లో ఎప్పటినుంచో ఆడియో, వీడియో కాల్ సదుపాయం ఉంది. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే ఎక్స్ ఈ సౌకర్యాన్ని తమ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: 8 మంది ఇండియన్ నేవీ మాజీ సిబ్బందికి మరణ శిక్ష!
ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఎలాన్‌మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరో విషయం ఏంటంటే ఈ ఫీచర్ ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే..settings లోకి వెళ్లి,Privacy & Safety ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత Direct Messages లోకి వెళ్లి Audio & Video Calling ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ మరో ఆఫర్ ఎంటంటే.. ఎవరికీ ఫోన్ నంబరు ఇవ్వకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. వాస్తవానికి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని గతంలోనే ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీల్లో వాడుకోవచ్చు.