Paris Olympics: గాయంతో క్వార్టర్స్‌లో రెజ్లర్ ఓటమి..

పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 68 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. గెలిచే దశలో ఉన్న ఆమె పోటీ మధ్యలో గాయం కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది.

New Update
Paris Olympics: గాయంతో క్వార్టర్స్‌లో రెజ్లర్ ఓటమి..

Wrestling Free Style 80kg: గెలిచే సత్తా ఉన్నా..గాయాలు పాలయితే ఎవరూ ఏమీ చేయలేరు. భారత మహిళా రెజ్లర్‌‌కు సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 68 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో గాయం కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 8-10 తేడాతో ఉత్తర కొరియా ప్లేయర్ సోల్‌ గమ్‌ చేతిలో ఓటమి పాలయ్యింది. అసలు పోటీ మొదలైన దగ్గర నుంచి నిశానే ఆధక్యంలో ఉంది. మొదటి రౌండ్‌లో నాలుగు పాయింట్లు సాధించింది. 8‌‌–2 తేడాతో ఉన్న నిశా కచ్చితంగా గెలుస్తుందిన అనుకున్నారు. కానీ మధ్యలో నిశా తీవ్రంగా గాయపడింది. వైద్యులు అక్కడే చికిత్స చేసినా లాభం లేకపోయింది. దాంతో నొప్పితో ఆమె ఇంక పోటీలో నిలవలేకపోయింది. అదే నొప్పితో విలవిల్లాడుతూ కన్నీటితో పోటీ నుంచి వైదొలిగింది. నిశా కనీస పోటీ కూడా ఇవ్వలేని స్థితిలో ఉండటంతో ప్రత్యర్థి చకాచకా పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో నిశా 6-4తో టెటియానా సోవా రిజ్కో (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది.

Also Read:హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు

Advertisment
తాజా కథనాలు