మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్‌లో మోదీ, సోనియా, రాహుల్

గ్లోబల్‌వైడ్‌గా ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(AI). ఈ టెక్నాలజీ అద్భుతమైన పనులు చేస్తూ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల ఫోటోలను మారుస్తూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో పెట్టిన కొన్నిగంటల్లోనే ఈ ఫోటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే తమకిష్టమైన నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా రకరకాల ఫోటోలను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఉపయోగించి మార్చుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి రాజకీయ నేతలు వచ్చి చేరారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్‌లో మోదీ, సోనియా, రాహుల్
New Update

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెక్షన్‌ బార్బీ సినిమాతో ముచ్చటించింది. బార్బీ ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి అందరిని అట్రాక్ట్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ఏఐని పొలిటికల్ యాంగిల్‌కు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒక AI కళాకారుడికి తట్టింది. తన టాలెంట్‌తో ఏఐ శైలిని ఉపయోగించి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాడు. ఇలా భారత రాజకీయ నాయకులను టెలిపోర్ట్ చేయడానికి హూ వోర్ వాట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఫోటోలను పంచుకున్నాడు. ఇందులో మన దేశ రాజకీయ నాయకులకు ఏఐతో బార్బీ మేకోవర్ చేశాడు."వీరిలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? ఇక్కడ బార్బీ, అక్కడ బార్బీ! ప్రతిచోటా బార్బీ" అని క్యాప్షన్ ఇచ్చాడు.

బార్బీ లుక్‌లో భారత రాజకీయ నేతలు

భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లకు సినిమాటిక్ లుక్ ఇచ్చాడు.బార్బీ మేకప్,సరికొత్త హెయిర్ స్టైల్ తో గులాబీ రంగు దుస్తులతో తీర్చిదిద్దారు.ఇంకేముంది ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నాయకుల ట్రెండీ లుక్ ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్‌

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండింగ్‌లో ఏది నడుస్తుంటే వాటిని ఫాలో అవుతుంటారు సహజమే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం బార్బీ రికార్డ్‌ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దీంతో అంతటా బార్బీ ఫీవర్ నడుస్తోంది. ప్రజలు, వ్యాపారాలు, బ్రాండ్‌లు ఇలా ప్రతి ఒక్కటీ గులాబీ రంగులో దూసుకుపోతోంది.ఏఐని ఉపయోగించి భారత్‌లోని 10 మంది రాజకీయ నాయకుల ఫోటోలకు మెరుగులు దిద్దాడు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్‌, సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

#viral #national-politics #international-news #technology #photos
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి