World Health Day 2024 : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈసారి థీమ్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవిర్భావం సందర్భంగా ఏప్రిల్ 7న ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించనున్న 76వ వార్షికోత్సవానికి 'నా ఆరోగ్యం, నా హక్కును' థీమ్‌గా ఎంచుకున్నారు. By B Aravind 07 Apr 2024 in ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health : ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వ్యవస్థాపక దినోత్సవం ఏప్రిల్ 7న ప్రతి ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈరోజున అన్నిదేశాల నుంచి ప్రజలు.. ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని ప్రచారం చేసేందుకు, డబ్య్లూహెచ్‌వో సాధించిన విజయాలను గుర్తించేందుకు కలిసి వస్తారు. డబ్య్లూహెచ్‌వో అనేది.. ఐక్యరాజ్యసమితి కింద పనిచేసే ఓ స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సమస్య(Health Problems) లను పరిష్కరించడం, వాటిగురించి ప్రజలకు అవగాహన పెంచడం దీని ప్రధాన లక్ష్యం. Also Read: సహజీవనం చేశాక విడిపోతే.. పురుషుడు ఆ పని చేయాల్సిందే : హైకోర్టు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఓ థీమ్‌ను సూచిస్తుంది. ఈ ఏడాది 76వ వార్షికోత్సవం సందర్భంగా.. 'నా ఆరోగ్యం, నా హక్కు'ని థీమ్‌గా ఎంచుకుంది డబ్య్లూహెచ్‌వో. ఇది ప్రాథమిక మానవ హక్కులపై దృష్టి పెడుతుంది. ఇందులో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ, విద్య, సమాచారాన్ని పొందడం మన హక్కు. WHO గురించి ఆసక్తికర విషయాలు 1.ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అభివృద్ధి చెందిన దేశాల్లో మశూచి, చికెన్‌పాక్స్(Chickenpox), పోలియో(Polio), టీబీ(TB) వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసింది. 2.ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పాటు ఇతర సంస్థలు నిర్వహిస్తాయి. 1948, ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థను స్విడ్జర్లాండ్‌లో స్థాపించారు. 3.ఇందులో పాల్గొనేవారు ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పిస్తారు. 4. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్(World Health Day Theme) లక్ష్యాన్ని సాధించడానికి, WHOలో ఉన్న వ్యక్తులు వివిధ ఆరోగ్య సంబంధిత అంశాల గురించి వ్యక్తుల మధ్య చర్చలు నిర్వహిస్తారు. వాటిగురించి ప్రదర్శనలు, పోటీలు మరియు అవార్డు వేడుకలను సైతం నిర్వహిస్తుంటారు. Also Read : ఈ 7 దేశాలు భారతీయులను ఆహ్వానిస్తున్నాయి! #telugu-news #national-news #united-nations #world-health-organisation #world-health-day మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి