World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్‌కు బీసీసీఐ హడావుడి..ప్రత్యేక కార్యక్రమం ప్లానింగ్ భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఓ లెవల్ లో ఉంటుంది. దేశభక్తి ఏరులై ప్రవహిస్తుంది. భారతీయుల్లో ఎక్కడలేని ఉత్సాహం కట్టలు తెంచుకుని వచ్చేస్తుంది. అందులోను వరల్డ్‌కప్ అంటే ఇంక చెప్పనే అక్కర్లేదు. అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ ఉంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ కు బీసీసీఐ హంగులద్దుతోందని సమాచారం. By Manogna alamuru 11 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి World Cup 2023 India vs Pakistan: మామూలుగాను భారత్-పాక్ మ్యాచ్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. దీన్ని మరింత హైలెట్ చేయాలని చూస్తోంది బీసీసీఐ (BCCI). మ్యాచ్ ముందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని తెలుస్తోంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ ఆట ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్ నరేంద్రమోడీ మైదానం (Narendra Modi Stadium). ఇందులో ఇప్పటికే ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఇప్పుడు రెండో సమరానికి ఇది రెడీ అవుతోంది. 1,32 వేలమంది కూర్చోగలిగే సామర్ధ్యం ఉన్న నరేంద్రమోదీ మైదానం మెగా మ్యచ్ కోసం ముస్తాబవుతోంది. మ్యాచ్ ముందు జరిగే ప్రత్యేక కార్యక్రమం కోసం బీసీసీఐ సెలబ్రిటీలను పిలిస్తోందని చెబుతున్నారు. బాలీవుడ్ సింగర్ అర్జీత్ సింగ్ (Arijit Singh) వేదిక మీద ప్రదర్శన ఇస్తారని సమాచారం. అంతేకాదు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), సూపర్‌స్టార్ రజనీకాంత్‌లు (Rajinikanth) కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని చెబుతున్నారు. వీరితో పాటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా వేదిక మీద సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఇక భారత్-పాక్ మ్యాచ్ అంటే ముందు నుంచే హడావుడి ఉంటుంది. పోలీసుల భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య ఉన్న కాన్‌ప్లిక్ట్ మ్యాచ్ మీద కూడా పడుతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అహ్మదాబాద్‌లో అత్యున్నతస్థాయి భద్రతను ఏర్పాటు చేవారు. గుజరాత్ పోలీసులు, ఎన్ఎస్జీ, ఆర్ఎఎఫ్, హోంగార్డులతో సహా పలు ఏజెన్సీలకు చెందిన 11వేలమందికి పైగా సిబ్బందిని అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. శుభ్మన్ గిల్ డౌటే.. అఫ్ఘాన్‌తో మ్యాచ్ తర్వాత ఇండియా , పాకి మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. గిల్ (Shubman Gill) డెంగ్యూ తగ్గి హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు కానీ అని ప్లేట్లెట్స్ కౌంట్ తక్కువగా ఉంది. భారత్-పాక్ మ్యాచ్కు ఇంకా నాలుగు రోజుల టైమ్ ఉంది. ఈ నాలుగు రోజుల్లో గిల్ డెంగీ నుంచి కోలుకున్నా వెంటనే బరిలోకి దిగే ఛాన్స్ లేదు. పైగా ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉండడంతో అసలు గిల్ పాక్ తర్వాత మ్యాచ్‌కైనా అందుబాటులోకి వస్తాడా అంటే చెప్పడం కష్టంగా మారింది. చికిత్స తర్వాత శుభమాన్ గిల్ చెన్నైలోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పీటీఐ(PTI) వార్తా సంస్థ తెలిపింది. గిల్ హోటల్‌కు తిరిగి వచ్చేశాడు. అక్కడ అతడిని బీసీసీఐ(BCCI) వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. Major updates about India vs Pakistan match in Narendra Modi stadium. - Amitabh Bachchan, Rajinikanth, Sachin will attend the match. - Arjit Singh will perform on stage. - There will be a colourful program ahead of the game. pic.twitter.com/U8H6UVz3W3 — Johns. (@CricCrazyJohns) October 11, 2023 Also Read:ముప్పేట గాజాను చుట్టుముట్టేసిన ఇజ్రాయెల్..దాడులు తీవ్రతరం #cricket #bcci #india-vs-pakistan #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి