Uttarakhand tunnel:10 మీటర్ల దూరంలో కూలీలు..సాయంత్రానికి బయటకు వచ్చేస్తారా?

ఉత్తరాఖండ్ లో టన్నెల తవ్వకం పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కూలీల దగ్గరకు చేరుకోవాలంటే ఇంకా పది మీటర్లు మాత్రమే ఉంది. అన్ని సవ్యంగా జరిగితే సాయంత్రానికి వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్డీఎంఏ అధికారులు చెబుతున్నారు.

Uttarakhand tunnel:10 మీటర్ల దూరంలో కూలీలు..సాయంత్రానికి బయటకు వచ్చేస్తారా?
New Update

ఉత్తరాఖండ్ సిల్ క్యారా సొరంగం తవ్వకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి ఎక్కడా ఆగకుండా టన్నెల్ ను తవ్వుకుంటూ వెళుతున్నారు. భూమికి సమాంతరంగా మనుషులతో డ్రిల్లింగ్ చేయిస్తున్నారు. చాలా దగ్గరగా అంటే ఇంకా 10 మీటర్ల దూరం తవ్వేస్తే కూలీల దగ్గరకు చేరుకోవచ్చు. మధ్యలో ఏ ఆటంకాలు రాకుండా ఉంటే ఈరోజు సాయంకాలానికల్లా వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలున్నాయని ఎన్డీఎంఏ అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు మెషీన్లు డ్రిల్లింగ్ చేయడం ఆగిపోయిన దగ్గర నుంచి 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ చేత తవ్విస్తున్నారు. వీరు బొగ్గు గనుల్లో తవ్వకంలో స్పెషలిస్ట్ లు . వీరు చాలా వేగంగా ఈ పనిని చేయగలుగుతారు. ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఇప్పటివరకు 50 మీటర్లు తవ్వేశారని చెబుతున్నారు అధికారులు. తవ్వడం అయిపోగానే 800 మి.మీ వెడల్పు ఉన్న పైపులను సొరంగంలోకి
ప్రవేశపెడతారు. దానిలో ను్చి నేరుగా కూలీలు స్ట్రెచర్ ల మీదకు వచ్చేలా ఏర్పాటు చేస్తారు.

Also Read:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం…ఈరోజే లాస్ట్

మరోవైపు టన్నెల్ పై భాగం అయిన కొండ మీద నుంచి కూడా కన్నం పెట్టుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికి 42 మీటర్లు పూర్తయింది. ఇంకా తవ్వాల్సింది 44 మీటర్లు ఉంది. రెండు వైపుల నుంచి కూడా కన్నాలు పెట్టి పైపులను పంపించాలని ఎన్టీఎంఏ అధికారుల ఆలోచన. పై నుంచి కూలీలను తెచ్చేందుకు 1.2 మీటర్ల వెడల్పు ఉండే గొట్టాలను అమరుస్తున్నారు.

సొరంగంలో కూలీలు చిక్కుకుని ఇప్పటికి 15 రోజులు అవుతోంది. మొత్తం 41 మంది ఇందులో ఉండిపోయారు. ప్రస్తుతానికి వీరందరూ క్షేమంగా ఉన్నారు. అంతకు ముందు అమర్చిన గొట్టాల ద్వారా వీరికి ఆహారం, నీరు అందిస్తున్నారు. అలాగే వాకీ టాకీలను కూడా లోపలికి పంపించి ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు. వారు ధైర్యం కోల్పోకుండా ఉండేలా చూస్తున్నారు.

#uttarakhand #workers #tunnel #drilling #silkyara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe