Raksha Bandhan: ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు.. వీడియో వైరల్

దేశంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో సోని గ్రామస్థులు.. ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టారు. ఆ తర్వాత వారికి స్వీట్లు అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Raksha Bandhan: ఆర్మీ జవాన్లకు రాఖీ కట్టిన మహిళలు.. వీడియో వైరల్
New Update

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం రాఖీ పండుగను జరపుకుంటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఇంట్లో చూసినా అక్కాచెల్లెళ్లు.. తమ అన్నాదమ్ముళ్లకు రాఖీలు కడుతూ సంతోషమైన క్షణాలను గడుపుతున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ తమ బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో సోని గ్రామస్థులు.. ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టారు. ఆ తర్వాత వారికి స్వీట్లు అందించారు.

Also read: రాఖీ పండుగ వేళ.. కవితను గుర్తుచేసుకుంటూ కేటీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని సముద్ర తీరంలో పండుగ సందర్భంగా సైకత శిల్పాన్ని రూపొందించాడు. ఇక దేశప్రజలకు ప్రధాని మోదీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్రమైన పండుగ అందరి బాంధవ్యాల్లో కొత్త మాధుర్యాన్ని, ఆనందం, శ్రేయస్సును ఇవ్వాలని కోరుతున్నానంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబ సభ్యులు.. రాజస్థాన్‌ సీఎం భజన్‌ లాల్ శర్మకి తన నివాసంలో రాఖీ కట్టారు. ఆ తర్వాత సీఎం వారికి కానుకలు అందించారు.

Also Read: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క!

#telugu-news #national-news #army #raksha-bandhan-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe