ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన మహిళలా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్రం స్పందించకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం ఈ అంశంపై చర్యలు తీసుకోకుంటే.. తామే ఒక అడుగు ముందుకేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించే విషయంలో మహిళా అధికారుల అభ్యర్థనను వదిలిపెట్టలేమని తేల్చి చెప్పింది. అయితే అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారుణులతో శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఇండియన్ కోస్ గార్డుకు చెందిన ఓ అధికారిణి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Also Read: భారత్‌లో పేదరికం తగ్గిపోయింది: నీతి ఆయోగ్
మేమే తేల్చుకుంటాం
దీనిపై చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మసానం విచారణ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. నేవీ, ఆర్మీ దళాలతో పోలిస్తే.. కోస్ట్ గార్టులో పనితీరు కాస్త భిన్నంగా ఉంటుందని అటర్నీ జనరల్ వెంకటరమణి.. సుప్రీంకోర్టుకు వివరించారు. అయితే మహిళలను తప్పించేందుకు ఇవి సరైన కారణాలు కాదంటూ ఏజీ వాదనలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే తామే రంగంలోకి దిగుతామని తేల్చి చెప్పింది. అందుకే ఈ వ్యవహారంపై పరిశీలించాలని.. ఇందుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ స్పందనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని చెబుతూ.. విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.
స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటించాలి
ఇదిలాఉండగా.. వారం రోజుల క్రితం ఇదే పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మహిళలను సమానంగా పరిగణింటే పాలసీని రూపొందించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాట్లపై సుప్రీం కోర్టు తీర్పులు వెలువరించినా కూడా ఇంకా పాత కాలపు ఆలోచనలోనే ఉన్నారా అంటూ విమర్శలు చేసింది. నౌకదళలంలో శాశ్వత కమిషన్ ఉండగా.. కోస్ట్ గార్డ్ మహిళల విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నలు సంధించింది. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Also read: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ