ఉత్తరప్రదేశ్లోని నోయిడా దారుణం జరిగింది. గౌతమ్ బుద్దా అనే యూనివర్సిటిలోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలో వాటర్ ట్యాంకులో ఓ మహిళ మృతదేహం దొరకడం కలకలం రేపింది. ఇది చూసి షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోని విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళ.. తన భర్త, అత్తతో పాటు అక్కడే ఉంటున్నట్లు పోలీసుల విచారణలో బయపడింది.
Also Read: చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ..
ఆ మహిళ భర్త, అత్త కలిసి ఆమెను హత్య చేసి పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళ భర్త దగ్గర్లో ఉన్న ఓ ఆసుపత్రిలో పనిచేస్తు్న్నట్లు తెలిసింది. అలాగే దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవని అక్కడి స్థానికులు పోలీసులకు తెలిపారు. అంతేకాదు ఆదివారం రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పారు. ఆ గొడవ జరగడంతోనే మహిళను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతురాలి భర్త, అత్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also read: ప్రధాని మోదీ డ్యాన్స్ వీడియో వైరల్.. స్పందించిన ప్రధాని