Supreme Court : చంద్రబాబు(Chandrababu) స్కిల్ స్కామ్ కేసు లో బెయిల్ రద్దుకి సంబంధించి సుప్రీంకోర్టు(Supreme Court) లో ఈరోజు విచారణ జరగనుంది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని ఇటీవల ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది. దీంతో గత నెల 16న జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జిషీట్ దాఖలైందని సీఐడీ(CID) తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని.. ఆయన కొడుకు లోకేష్ రెడ్‌బుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నారని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక రెడ్‌బుక్‌లో పేర్లున్న వారి అంతుచూస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు మే 7కు వాయిదా వేసింది. దీంతో ఈ కేసుపై ఈరోజు విచారణ చేయనున్న ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది.
పూర్తిగా చదవండి..Chandra Babu Naidu : చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ..
చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని బెయిల్‌ను రద్దు చేయాలని ఇటీవల ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఈరోజు విచారణ జరగనుంది.
Translate this News: