/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-12-6.jpg)
Car Accident: శ్వేతా దీపక్ సుర్వాసే, ఆమె ఫ్రెండ్ సూరజ్ ఇద్దరూ కలిసి ఔరంగాబాద్‌లోని సులిభంజన్ హిల్స్‌కు వెళ్ళారు. అక్కడ ఉన్న ఆలయం దర్శనం చేసుకుని కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. దీని తర్వాత శ్వేతా డ్రైవింగ్ నేర్చుకుంటానంటే సూరజ్ ఆమెకు కారును ఇచ్చాడు. తాను వీడియో తీస్తూ ఉన్నాడు. శ్వేతా కారు నడుపుతూ కొండ ఎక్కించింది. కొండ ఇంకా 50 మీటర్ల దూరంలో ఉందనగా ఆమె కారును రివర్స్ చేయడానికి ప్రయత్నించింది. పక్కనుంచి ఆమె స్నేహితుడు స్లో, స్లో అని చెబుతూనే ఉన్నాడు. క్లచ్ పట్టుకో అని అరుస్తూనే ఉన్నాడు. కానీ శ్వేత కారు రివర్స్ చేయడంలో ఆక్సిలరేటర్ మీద కాలు వేసింది. అది కాస్తా స్పీడ్ అయిపోయి వేగంగా కిందికి వెళ్ళి లోయలో పడిపోయింది. అంతే కారు 300 అడుగుల లోయలోకి అత్యంత వేగంగా జారిపోయింది.
లోయలోకి పడిపోయిన కారు తుక్కు తక్కు అయిపోయింది. అంతా చూస్తుండగా జరిగిపోయింది. కారులో ఉన్న శ్వేత కూడా చనిపోయింది. ఇదంతా సూరజ్ తీస్తున్న వీడియోలో రికార్డ్ అయింది.
On Camera, Woman Reverses Car Off #Maharashtra Cliff, Falls 300 Feet, Dies
Read Here: https://t.co/KRKKoWvbkhpic.twitter.com/lk2L3BtZHW
— NDTV (@ndtv) June 18, 2024
Also Read:Ambani Wedding: జూన్ 29 నుంచి జూలై 14 వరకు అంబానీ ఇంట పెళ్ళి వేడుకలు..