Ambani Wedding: జూన్ 29 నుంచి జూలై 14 వరకు అంబానీ ఇంట పెళ్ళి వేడుకలు.. భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్ళి వేడుకలకు అంతా సిద్ధమయ్యింది. అనంత్- రాధికా మర్చంట్ వివాహ ముచ్చటలు జూన్ 29 నుంచి మొదలవనున్నాయి. సుమారు 20 రోజుల పాటూ వీటిని నిర్వహించనున్నారు. By Manogna alamuru 19 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ananth ambani- Radhika marchent Wedding: మార్చి నెలలో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. దేశవిదేశాల నుంచి ప్రముఖులు, పెలబ్రిటీలు దీనికి హాజరయ్యారు. వారం రోజుల పాటూ అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వీరి పెళ్ళి గురించి అందరూ చర్చించుకునే సమయం ఆసన్నమయింది. జూలై 12న జరగనున్న అనంత్-రాధికాల పెళ్ళి పెళ్ళి వేడుకలు పదిహేను కోజుల ముందుగానే ప్రారంభం అవనున్నాయి. మార్చిలో ప్రీవెడ్డింగ్ వేడుకలతో గుజరాత్‌లోని జామ్‌నగర్ మారుమోగిపోయింది. తర్వాత మే 29 నుంచి జూన్ 1 వరకు సెకండ్ ప్రీవెడ్డింగ్ అయింది. ఇది మద్యధరా సముద్రంలోని ఒక క్రూజ్ షిప్‌లో జరిగింది. ఐరోపా స్టైల్‌లో పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు జూన్ 29 నుంచి అసలు పెళ్ళి వేడుకలు మొదలవనున్నాయి. ముంబయిలోని ముకేశ్ నివాసం ఆంటీలియాలో నిర్వహించనున్న పూజా కార్యక్రమంతో ఇవి మొదలవుతాయని అంబానీ కుటుంబం చెప్పింది. తర్వాత జూలై 12న జియో వరల్డ్ కన్వన్షెన్ సెంటర్‌లో అనంత్-రాధికాల పెళ్ళి జరగనుంది. జులై 14న అతిథులకు విందు ఇవ్వనున్నారు. దీనికి పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సెలబ్రేషన్‌కు ప్రముఖ డిజైనర్లు బట్టలను డిజైన్ చేస్తున్నారు. Also Read:Gemini App: తెలుగుతో సహా 9 భాషల్లో గూగుల్ జెమిన్ ఏఐ యాప్ #jio-conventional #anant-ambani-and-radhika-merchant #ananth-ambani #wedding మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి