హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. కార్‌ను డ్రైవ్ చేసిన ఓ మహిళ దానిని పార్కింగ్ చేసేందుకు యత్నించింది. దీంతో కారు అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం కారు నడుపుతున్న ఓ మహిళ పార్కింగ్ చేయడం కోసం కారును రివర్స్ చేసింది. దీంతో కారు అదుపుతప్పి.. 30 లీటర్ల లోతైన గుంతలో పడిపోయింది.
Also Read: ఆలయం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్.. వీడియో వైరల్
బోల్తాపడ్డ కారు ధ్వంసమైంది. అందులో ఉన్న మహిళకు తీవ్రంగా గాయాలయ్యయి. అక్కడున్న స్థానికులు కారు కింద పడటాన్ని గమనించి అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. కొండప్రాంతాల్లో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్