Watch Video: 30 అడుగుల ఎత్తు నుంచి పడిన కారు.. వీడియో వైరల్ హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో ఓ మహిళ కారును పార్క్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో కారు అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 08 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. కార్‌ను డ్రైవ్ చేసిన ఓ మహిళ దానిని పార్కింగ్ చేసేందుకు యత్నించింది. దీంతో కారు అదుపుతప్పి 30 అడుగుల ఎత్తు నుంచి గుంతలో పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం కారు నడుపుతున్న ఓ మహిళ పార్కింగ్ చేయడం కోసం కారును రివర్స్ చేసింది. దీంతో కారు అదుపుతప్పి.. 30 లీటర్ల లోతైన గుంతలో పడిపోయింది. Also Read: ఆలయం బయట రాహుల్ ఫొటోతో డోర్‌మ్యాట్.. వీడియో వైరల్ బోల్తాపడ్డ కారు ధ్వంసమైంది. అందులో ఉన్న మహిళకు తీవ్రంగా గాయాలయ్యయి. అక్కడున్న స్థానికులు కారు కింద పడటాన్ని గమనించి అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. కొండప్రాంతాల్లో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: హెచ్ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్ While parking the car near power house road in #Solan, the woman lost control of the car and the car fell into a ditch about 30 meters ditch. The woman suffered from serious injuries and was admitted to the hospital. pic.twitter.com/W3nEYwwOmH — Nikhil Choudhary (@NikhilCh_) July 8, 2024 #telugu-news #accident #national-news #car-parking #viral-vide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి