Machilipatnam: మచిలీపట్నంలో మూడు రోజుల పసి కందు అదృశ్యం! మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరగా ఘటన జరిగింది. By Bhavana 14 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Machilipatnam: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఘంటసాల మండలం శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. మూడు రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆమె గైనిక్ వార్డులో ఉంటుంది. శనివారం రాత్రి 1:30 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ నర్స్ వేషంలో ఆస్పత్రికి వచ్చి మగ శిశువును ఎత్తుకు పోయింది. వెంటనే గుర్తించిన స్వరూప రాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. మగ శిశువు తీసుకెళ్లిన మహిళను ఇంగ్లీష్ పాలెంలో గుర్తించి పట్టుకున్నారు. శిశువును సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కృష్ణా జిల్లా పోలీసుల సమయస్ఫూర్తిని నగరవాసులు అభినందిస్తున్నారు. స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర... శిశువును అపహరించిన ఘటనలో ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అనుమానం వ్యక్తం చేశారు,.ఈ ఘటన ప్రమేయం ఉన్నవారిని ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్లే జరిగిందని మంత్రి అన్నారు.సెక్యూరిటీ, ఆస్పత్రి సిబ్బందిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కొల్లు రవీందర అన్నారు. #politics #women #kolluravindra #baby-boy #kidnap #machilipatnam #minister మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి