Machilipatnam: మచిలీపట్నంలో మూడు రోజుల పసి కందు అదృశ్యం!
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటన జరిగింది. మూడు రోజుల మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ నిందితురాలిని పట్టుకుని శిశువును కన్న తల్లి వద్దకు చేర్చారు. స్వరూప రాణి అనే మహిళ కాన్పు కోసం మచిలీపట్నం ఆసుపత్రిలో చేరగా ఘటన జరిగింది.