Air India: ఫాగ్‌ కేర్‌ ప్రారంభించిన ఎయిర్‌ ఇండియా!

ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి బుకింగ్‌ లను రీ షెడ్యూల్‌ చేసేందుకు లేక రద్దు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు టాటా యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది.

New Update
Air India: సిక్‌ లీవ్ పెట్టిన సిబ్బంది..నిలిచిన 70 ఎయిర్‌ ఇండియా విమానాలు!

Air India launches FogCare : శీతాకాలం కారణంగా ఢిల్లీ నగరంలో భారీగా పొగమంచు కురుస్తుంది. దీని వల్ల ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయంలో చాలా విమానాలు దారి మళ్లాయి. పొగమంచు కారణంగా కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి బుకింగ్‌ లను రీ షెడ్యూల్‌ చేసేందుకు లేక రద్దు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు టాటా (TATA) యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది.

ఎయిర్‌ ఇండియా (Air India) తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఫాగ్‌కేర్‌ అని పిలుస్తారు. ఇందులో భాగంగా ఎయిర్‌ ఇండియా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదనపు ఖర్చు లేకుండా టికెట్‌ ను రీ షెడ్యూల్‌ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ''ఫాగ్‌ కేర్‌ (FogCare) చొరవ అనేది పొగమంచు వల్ల విమానాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న అతిథులకు అసౌకర్యాన్ని తగ్గించడానికి ఒక హృదయపూర్వక ప్రయత్నం ఇది అని సిబ్బంది వివరించారు.

ఇది నెట్‌ వర్క్‌ షెడ్యూల్‌ సమగ్రతను కొనసాగించడంలో కూడా సహాయపడుతుంది అని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్‌ రాజేష్‌ డోగ్రా (Rajesh Dogra) అన్నారు. ఢిల్లీలో పొగమంచు కారణంగా 40 కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందులో ఎనిమిది అంతర్జాతీయ డిపార్చర్‌ లు, నాలుగు అంతర్జాతీయ రాకపోకలు, 22 దేశీయ విమానాలు రద్దు చేయడం జరుగుతుంది. ఐదు దేశీయ రాకపోకలలో ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also read: తిరుపతి ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించిన అంగన్వాడీ వర్కర్లు !

Advertisment
తాజా కథనాలు