Health Tips For Winter Season : వర్షాకాలం (Rainy Season)గానీ, చలికాలం (Winter Season)గానీ వచ్చిందంటే చాలు.. అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఉతికిన బట్టలు ఆరాలంటే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి ఉంటుంది. బట్టలు బయట ఆరేస్తే మళ్లీ వర్షం వస్తుంది. లేదంటే తేమ, మంచు తుంపరల కారణంగా.. బట్టలు ఆరవు. దీంతో.. చాలా మంది తమ గదిలో బట్టలు ఆరేసి ఫ్యాన్స్ వేస్తారు. అయితే, ఎప్పుడూ ఇలా చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వర్షాకాలం, చలికాలంలో ఇంట్లో ఫ్యాన్ పెట్టి బట్టలు ఆరబెట్టడం వలన ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు. తడి బట్టలు ఇంట్లో ఆరబెట్టడం ఫంగస్ సహా పలు రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
మాంచెస్టర్ (Manchester)లోని నేషనల్ ఆస్పెర్‌గిలోసిస్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. తడి బట్టలను ఇంట్లో ఆరబెట్టడం వల్ల పిల్లలు న్యుమోనియా, సైనస్, అలర్జీ బారిన పడతారని నిర్ధారించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదిక చెబుతుంది. ఇంట్లో బట్టలు ఆరబెట్టడం వల్ల గదిలో తేమ 30 శాతం పెరుగుతుందని, ఇది ఆర్స్పెగిల్లస్ ఫ్యూమిగేటస్ అనే ఫంగస్ పెరుగుదలకు దారితీస్తుందని ఒక అధ్యయనంలో కనుగొన్నారు. ఇది శ్వాస ప్రక్రియను ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇంట్లో బట్టలు ఆరబెట్టాల్సి వస్తే.. ఈ పని చేయండి..
👉 తడి బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నీటిని పూర్తిగా పిండేసిన తరువాతే ఆరబెట్టాలి.
👉 బట్టలు తడిగా ఉన్నప్పుడు వాటి తేమను తగ్గించడానికి ఉప్పును ఉపయోగించొచ్చు. ఉప్పు తేమను గ్రహిస్తుంది. ఇది ఫంగస్‌ను నియంత్రిస్తుంది.
👉 ఇంట్లో బట్టలు ఆరబెట్టేటప్పుడు దుర్వాసన రాకుండా ఉండాలంటే బట్టలు ఉతికేటప్పుడు 2 చెంచాల వెనిగర్ నీళ్లలో కలపండి. దీంతో ఇల్లు దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇది దుస్తులకు మృదుత్వాన్ని కూడా ఇస్తుంది.