Wine Shops : మందుబాబులకు షాక్.. రేపు వైన్స్‌ షాపులు బంద్‌

హైదరాబాద్‌, ,సైబరాబాద్‌తో సహా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లిక్కర్ అమ్మకాలు జరగకుండా వైన్స్‌ షాపులను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్‌లు మూతబడనున్నాయి.

New Update
Wine Shops : మందుబాబులకు షాక్.. రేపు వైన్స్‌ షాపులు బంద్‌

Shock To Wine Addicts : మందుబాబు(Wine Addicts) లకు పోలీసులు చేదువార్త తెలిపారు. సోమవారం వైన్‌ షాప్‌(Wine Shops) లు ముసివేస్తున్నట్లు ప్రకటించారు. హోలీ పండుగ సందర్భంగా.. కల్లు, వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌(Hyderabad), సైబరాబాద్‌తో సహా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో లిక్కర్ అమ్మకాలు జరగకుండా వైన్స్‌ షాపులను మూసివేయాలని సూచనలు చేశారు. కానీ స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు.

Also Read : దారుణం.. మొబైల్‌ఫోన్‌ పేలి నలుగురు చిన్నారులు మృతి

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్ కమిషనర్‌ల నుంచి లిక్కర్‌ షాపు(Liquor Shop) ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్‌లు మూసివేయనున్నారు. హోలీ వేడులకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అలాగే హోలీ పండుగ(Holi Festival) ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని సూచనలు చేశారు. రోడ్లపై ఇష్టమచ్చినట్లు వేడుకలు జరుపుకుని వాహనాదారులకు ఇబ్బందులు కలిగిస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రోడ్లపై వెళ్లే వారిపై రంగులు చల్లినా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రోడ్లపైకి గుంపులుగా రాకూడదని సూచనలు చేశారు.

Also Read : అడ్డమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు.. ఆ యూట్యూబ్‌ ఛానెల్స్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు