WhatsApp Update : ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్(Instagram), వాట్సాప్(WhatsApp) లను ప్రపంచవ్యాప్తంగా చాలామంది వినియోగిస్తున్నారు. ఇది ప్రజల మధ్య సంభాషణకు మాత్రమే కాకుండా అనేక అధికారిక పనులకు మంచి మాధ్యమంగా మారింది. అయితే వాట్సాప్.. భారత్(India) నుంచి వెళ్లిపోయే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వెనుక కారణం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ గోప్యతా ఫీచర్. వాస్తవానికి ఇది భారత ప్రభుత్వం 2021 తీసుకొచ్చిన ఐటీ రూల్స్‌కు విరుద్ధంగా ఉంది.
Also read: హెల్త్ ఇన్సూరెన్స్.. ఏజ్ లిమిట్ రూల్ మారింది తెలుసా?
1.ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను తొలగించాలని భారత్ నుంచి ఒత్తిడి వస్తే మేము ఇండియాకు గుడ్ బై చెబుతామని వాట్సాప్ చెప్పింది.
2. భారత IT రూల్స్ 2021లోని రూల్ 4 (2) ప్రకారం.. వాట్సాప్‌లో మొదట ఎవరు సందేశాన్ని పంపారు, ఎక్కడి నుండి పంపారు అనే సమాచారాన్ని అందించాలి. దీంతో భారత్ సవరించిన ఈ కొత్త ఐటీ రూల్స్‌ను వాట్సాప్ సవాలు చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ కోర్టులో తెలిపింది.
3. వినియోగదారుల గోప్యత హక్కు కింద, కంపెనీ దాని ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసివేయమని వాట్సాప్ చెప్పింది. తమపై దీన్ని తీసివేయాలని ఒత్తిడి వస్తే వాట్సాప్ సేవలు భారత్‌లో నిలిపివేస్తామని స్పష్టం చేసింది.
4. వాట్సాప్ భారతదేశాన్ని విడిచిపెడితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ కూడా ఇక్కడి నుండి వెళ్లిపోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
5. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. చాలా మంది భారతీయ వినియోగదారులే ఇందులో ఉన్నారు. 535.8 మిలియన్ల భారతీయ వినియోగదారులు ఉన్నందున మెటా(Meta) కు ఇండియా చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం భారత ప్రభుత్వం - వాట్సాప్ మధ్య జరుగుతున్న యుద్ధం పోనుపోను ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
Also read: రైలు పట్టాల మధ్య ఇరుక్కున్న ప్రయాణీకుడు ..ప్రాణాలకు తెగించి కాపాడిన లేడీ కానిస్టేబుల్!