Hyderabad Metro | భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రో ఆగనుందా?

భారీ వర్షం కారణంగా మెట్రో రైళ్ల సర్వీసులకు ఎక్కడా ఆగలేదు అని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మెట్రో రైళ్లను నిలిపివేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి.

New Update
Hyderabad Metro | భారీ వర్షానికి హైదరాబాద్ మెట్రో ఆగనుందా?

Hyderabad Metro: హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం, వడగళ్ల వానలు కురిశాయి. గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది.ఈ భారీ వర్షానికి జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. హైదరాబాద్ లోని కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట్లో భారీ వర్షం కురిసింది. బాలానగర్, ఫతేనగర్, సనత్నగర్లో కూడా వర్షం కురిసింది. జీడిమెట్ల, చింతల్, షాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

అయితే.. భారీ వర్షానికి కరెంట్ కూడా లేకపోవడంతో… మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది ముందు జాగ్రత్తగా మెట్రో రైళ్లను నిలిపేశారని ప్రచారం చేశారు. దీంతో ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, వర్కర్స్ టెన్షన్ పడ్డారు.

Also Read: వరల్డ్ రెడ్ క్రాస్ డే.. ఎందుకు జరుపుకుంటారు?

వర్షం కారణంగా కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు | Hyderabad Metro

మరోవైపు, రోడ్లపై ట్రాఫిక్ జామ్ వల్ల బస్సులకు వెళ్లే వారు సైతం మెట్రో రైళ్లకు వెళ్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. మెట్రోలో వెళ్లేందుకు ప్రయాణికులు భారీగా మెట్రో స్టేషన్లకు వెళ్తుండడం వల్ల అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో రద్దీ నెలకొంది. చాలా మెట్రో స్టేషన్లలో సాధారణం కంటే అధికంగా జనాలు కనిపించారు.

ఇక హైదరాబాద్ లో వర్షం కురవడం వల్ల రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. చాలా చోట్ల వాహనాలు ముందుకు కదల్లేదు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటి వల్ల వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. సికింద్రాబాద్‌, ఆల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్ పల్లి, చిలకలగూడ, జీడిమెట్ల, మలక్‌పేట, ఎర్రగడ్డ, బోయిన్‌పల్లి, సుచిత్ర, ప్యాట్నీ, ఎల్బీనగర్‌, కాప్రా, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ముషీరాబాద్‌, చిక్కడ్ పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు బాగా వచ్చి చేరింది.

Advertisment
తాజా కథనాలు