Chirutha : కశ్మీర్(Kashmir) లోని గందేర్బల్ జిల్లాలోని ఫతేహ్‌పూర గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇద్దర మహిళలపై దాడి చేసిన చిరుతతో.. ఓ ఫారెస్ట్ అధికారి ఫైట్ చేశాడు. ప్రాణాలు కూడా లెక్కచేయకుండా దానిపై పోరాడి బంధించగలిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఫతేహ్‌పూర గ్రామంలోకి బుధవారం ఉదయం ఓ చిరుత ప్రవేశించింది. అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఓ ఇద్దరు మహిళలపై కూడా దాడి చేసి గాయపర్చింది. దీంతో స్థానికులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Also read: సందేశ్‌ఖాలీ ఘటన.. దీదీ సర్కార్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
దీంతో ఆ గ్రామానికి చేరుకున్న ఫారెస్టు అధికారులు(Forest Officers), పోలీసులు చిరత(Leopard) కదలికలపై నిఘా పెట్టారు. అయితే చిరుతను పట్టుకొనే క్రమంలో అది తప్పించుకొని ఓ ఇంటి కంపౌడ్‌లోకి వెళ్లింది. ఆ కంపౌడ్‌లోకి వెళ్లిన ఓ అటవీ అధికారికి చిరుతకు మధ్య రెండు అడుగుల దూరం మాత్రమే ఉంది. దీంతో చిరుత అతనిపై దాడి చేసి చేతిని గట్టిగా చేజిక్కించుకుంది. అయినప్పటికీ ఆ అటవీ అధికారి మాత్రం ధైర్యం కోల్పోకుండా చిరతతో పోరాడాడు. మరో ఫారెస్టు అధికారి వెనుకనుంచి వచ్చి ఆ చిరుతను కట్టెతో కొట్టాడు. అక్కడున్న వారందరూ కలిసి దాన్ని కొట్టేసరికి.. ఆ చిరుత ఫారెస్టు అధికారిని విడిచిపెట్టింది.
ఆ తర్వాత చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కేజ్‌లో బంధించారు. అనంతరం ఫారెస్టు అధికారులు చిరుతను స్వాధీనం చేసుకున్నారు. చిరుత దాడిలో గాయపడ్డ ఆ అధికారితో పాటు, మరో అధికారిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఫారెస్టు అధికారి చిరుతతో పోరాడిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో చక్కర్లు కొడుతోంది. నెటీజన్లు ఆ అధికారి పోరాటంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also read: ఆ గ్రామంలోకి ఏం టచ్ చేసినా జేబుకు చిల్లే.. భారతీయ చట్టాలను పట్టించుకోని ఊరు!