Health Benefits: జ్వరం తగ్గిన తర్వాత నోరు చేదుగా ఉంటుంది ఎందుకు..చేదు పోవాలంటే..? చాలా మందికి సాధారణ జ్వరం లేదా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వస్తాయి. ఇలా ఏది వచ్చినా.. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు కొన్ని రోజులు సమయం పట్టింది. జ్వరం తగ్గిన తర్వాత కూడా నోరంతా చేదుగా ఉంటుంది. ఉల్లిపాయను పచ్చళ్లు చేసుకుని తింటే నోట్లో చేదు వెంటనే తగ్గుతుంది. By Vijaya Nimma 14 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి నోరు చేదుగా ఉండటానికి రకరకాల సమస్యలు దోహదం చేస్తాయి. సహజంగానే వృద్ధాప్యంలో నాలుక మీద ఉండే రుచి మొగ్గల సంఖ్య, లాలాజలం ఉత్పత్తి కాణాలు తగ్గుతాయి. అనేక సందర్భాల్లో నోటిలో చేదు సమస్యను ఎదుర్కొంటారు. దీనికి చిగుళ్ల వ్యాధి, బ్యాక్టీరియా, నోటి అంటువ్యాధులు వల్ల చేదు, రుచి కారణమవుతాయి. నోరంతా చేదుగా ఉండటం ఎందువల్లో అర్ధంకాక చాలా మంది ఆశ్ఛర్యపోవటంతో పాటు భయాందోళనకు లోనవుతుంటారు. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు నిమ్మకాయ రసం తాగితే ఏమవుతుంది..? మనకి జ్వరం వచ్చినప్పుడు వేసుకునే టాబ్లెట్స్ వల్ల నోరు చేదుగా ఉంటుంది అంటారు. అయితే ఈ చిట్కాలను పాటించడం వల్ల నోరు చేదును త్వరగా తగ్గించుకోవచ్చు. కాగా.. జ్వరం తగ్గాక నోటి చేదును పోగొట్టుకునేందుకు పుదీనా ఆకులు చాలా భాగ పనిచేస్తాయి. కొన్ని పుదీనా ఆకులను నమిలి మింగేయాలి. దీనివల్ల నోటికి తిరిగి రుచి వచ్చి చేదు పూర్తిగా పోగుతుంది. కొత్తి మీర ఆకులు, వెల్లుల్లి, ఎండు, పచ్చిమిరపాయలు, జీలకర్ర, ఉల్లిపాయను పచ్చళ్లు చేసుకుని తింటే నోట్లో చేదు వెంటనే తగ్గుతుంది. పోషకాహార లోపాలతో పాటు, ఇతర సమస్యలు నోట్లోని చేదును పోగొట్టడానికి మిరియాల రసం మంచిగా పనిచేస్తోంది. ఘాటుగా ఉండేలా మిరియాల రసంతో అన్నం తింటే రుచిగా ఉండటంతో పాటు నోరు చేదు పోతుంది. అంతేకాకుండా..పండు మిరపకాయలు, గోంగూర పచ్చళ్లతో అన్నం తిన్నా నోటికి రుచిగా ఉంటుంది. ఆల్బుకరా కాయలు తిన్నా నోటిలోని చేదు వెంటనే తగ్గిపోతుంది. అంతేకాకుండా.. టీస్పూన్ అల్లం రసంలో తేనెతో తిన్న, వెల్లుల్లి రెబ్బలను తింటే నోటి చేదు పోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రెగ్యులర్ డెంటల్ చెక్-అప్లు, నోటి పరిశుభ్రత కలగి ఉండటం ద్వారా సమస్యలను నివారించవచ్చని అంటున్నారు. కారణం ఏమైనప్పటికీ, మీ నోటిలో చెడు రుచిని కలిగి ఉండటం వలన మీ ఆకలిని నాశనం చేయవచ్చు అని వైద్యులు అంటున్నారు. ఇది పోషకాహార లోపాలతో పాటు, ఇతర సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. #tips #health-benefits #mouth-bitter #fever మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి