Health Benefits: గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు నిమ్మకాయ రసం తాగితే ఏమవుతుంది..? ఈ మద్యకాలంలో చాలా గ్యాస్ సమస్యలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్ని ఆహార నియమాలు పాటించిన సమస్య నుంచి దూరం కాలేకపోతున్నారు. కొన్ని సందర్భల్లో ఏం తిన్నా వెంటనే గ్యాస్ ఎక్కువై నరకంగా ఉంటుంది. నిమ్మరసంతో గ్యాస్ సమస్య దూరం చేసుకోవచ్చు. By Vijaya Nimma 14 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రకృతి మనకు ప్రసాదించిన ఓ అద్భుతమైన వరంలో నిమ్మకాయ ఒక్కటి. పసుపు పచ్చని రంగులో నిగనిగలాడే ఈ పుల్లటి, గుండ్రని పండులో ప్రోటిన్, విటమిన్ సి, కొవ్వు, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, వంటి పోషకాల ఎక్కువగా ఉంటాయి. పోషకాలతో ఉన్న నిమ్మకాయతో పాటు నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి రోగనిరోధక శక్తితోపాటు గుండె జబ్బలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలను నివారిస్తాయి. శరీర కణజాల అభివృద్ధి, విటమిన్- సీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు నిమ్మరసం రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుదాం. ఇది కూడా చదవండి: చెవిపోటును చిటికెలో పోగొట్టే చిట్కాలు మీ కోసం ప్రతిరోజు నిమ్మరసాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతు ఉంటారు. ఉదయం నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎన్నో సమస్యల నుంచి ఉపశమం ఉంటుందన్నారు. అయితే.. ఈ నిమ్మరసంలో ఉండే యాసిడ్ స్వభావంతో గ్యాస్ సమస్య ఉన్న వారు దీనిని తాగితే మరింత పెరుగుతుందని చాలా మంది అపోహలు పెట్టుకుంటారు. నిమ్మరసం ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఈ నిమ్మరసాన్ని తాగినప్పుడు అది నోట్లోని లాలాజలంతో కలిశాక దాదాపు గంట తర్వాత అది క్షార స్వభావంగా మారుతుంది. దీని వలన జీర్ణాశయంలో క్షార వాతావరణంగా మారుతుంది. దీనివల్ల గ్యాస్ యాసిడిటీ సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. నిమ్మరసం తాగితే కొవ్వు కరుగుతుంది అంతేకాదు.. నిమ్మరసం తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య అనేది పెరగదని వైద్యులు చెబుతున్నారు. నిమ్మరసంలో ఉండే యాసిడ్ స్వభావం మన శరీరంలో ఆల్కలైన్‌గా మారుతుంది.. దీనివల్ల గ్యాస్ సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే... ఏ పదార్ధాన్ని అయినా మితంగా తీసుకోవాలని అంటున్నారు. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే హెల్త్‌కి మంచిది. నిమ్మరసంతోపాటు తేనె, అల్లం రసం కలుపుకోని తాగితే చాలా మంచిది. ఇలా తాగటం వలన మన శరీర మెటబాలిజం అధికంగా పెరిగి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు ఉన్నవారు ఈ డ్రిక్ తాగితే మంచి ఫలికం ఉంచుటుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటకు పంపడంలో ఈ నిమ్మరసం బాగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. #health-benefits #lemon-juice #gas-problem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి