Bald : మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ?

గాలి, నీరు, ఆహారం కలుషితం కావడంతో పాటు సరైన పోషకాహారం లేకపోవడం వల్ల.. టెస్టోస్టెరీన్ హర్మోన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్‌గా మారడం వల్ల, వంశపార్యపరంగా, జన్యు లోపం కారణంగా బట్టతల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

New Update
Bald : మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ?

Bald Why : ఈరోజుల్లో చాలామందికి బట్టతల(Bald) అనేది ఓ పెను సవాలుగా మారిపోయింది. దీని నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరైతే బయటకు వెళ్లినప్పుడు బట్టతల చూపించడం ఇష్టం లేక.. క్యాప్‌లు, విగ్గులు కూడా పెట్టుకుంటారు. అయితే ఈ సమస్య అనేది మగవారి(Men's) లో మాత్రమే కనిపిస్తుంది. ఆడవారికి బట్టతల రాదు. వీళ్లకు రాకపోవడానికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గాలి, నీరు, ఆహారం కలుషితం కావడంతో పాటు సరైన పోషకాహారం లేకపోవడం కూడా బట్టతలకు కారణమవుతుందని చెబుతున్నారు. అలాగే వంశపార్యపరంగా, జన్యుల లోపం కారణంగా కూడా ఇది వస్తుందని అంటున్నారు. మనం చేసేటువంటి పనుల్లో ఒత్తిడికి గురై.. శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయని.. మానసిక ఆందోళనలకు కూడా ఇందుకు కారణమవుతున్నాయని బెబుతున్నారు.

బట్టతల ఎందుకు వస్తుంది
బట్టతల రావడానికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషుల్లో బట్టతల రావడానికి ప్రధాన కారణం టెస్టోస్టెరీన్(Testosterone) అనే హార్మోన్. టెస్టోస్టెరీన్ అనేది డిహైడ్రో టెస్టోస్టెరీన్‌గా మారడంతో వెంట్రుకలు రాలిపోతాయి. ఆ తర్వాత కొత్తగా వెంట్రుకలు రావు దీనివల్ల బట్టతల ఏర్పడుతుంది. అయితే ఆడవారి(Women's) లో ఈ హర్మోన్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే ఆడవాళ్లలో బట్టతల రావడం అనేది చాలా అరుదు. అయితే యుక్త వయస్సు వచ్చాక జన్యులోపాలను, ఇంట్లో ఎవరికైనా బట్టతల ఉంటే ముందుగానే వైద్యులను సంప్రదించి.. వారి సూచనలు పాటిస్తే కొంతవరకైన జుట్టు ఊడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

వైద్యుల సలహా తీసుకోండి 

కొన్ని రకాల మందులు కూడా వాడటం వల్ల బట్టతలకు కారణం అవుతున్నాయి. క్యాన్సర్‌, అధిక రక్తపోటు, డిప్రెషన్ అలాగే ఆర్థరైటీస్‌ ట్రీట్‌మెంట్‌లకు వాడే మందులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతున్నాయి. అందుకే జుట్టు రాలిపోతే.. ఇందుకోసం ఏవైన మందులు వాడేముందు వైద్యలతో కూడా మాట్లాడి వారి సలహా తీసుకుంటే మేలు జరుగుతుంది.

విటమిన్లు సమృద్ధిగా దొరికే ఆహారం తీసుకోండి

పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. విటమిన్లు ఎ,సి,డి,ఇ, బయోటిన్, ఐరన్ సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహరం తీసుకుంటే.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది. బట్టతల రాకుండా ఆ ప్రమాదాన్ని నివారిస్తుంది. మరో విషయం ఏంటంటే నాణ్యత లేని సబ్బులు వాడటం వల్ల కూడా జుట్టు రాలడానికి ఓ కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read : India-Mayanmar: భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్: అమిత్ షా

Advertisment
తాజా కథనాలు