Dhruv Rathee: జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన.. వివాదంలో ఇరుక్కున్న ధ్రువ్ రాఠీ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ జస్టీస్ ఫర్ నిర్భయ2 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీంతో ధ్రువ్‌రాఠీ టీఎంసీ ప్రభుత్వానికి లొంగిపోయాడంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. By B Aravind 15 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం జరగడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఈ ఘటనపై ఎక్స్ లో అప్‌లోడ్ చేసిన పోస్టుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించి ధ్రువ్ రాఠీ ఎక్స్‌లో జస్టీస్ ఫర్ నిర్భయ 2 అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ పోస్టును డిలీట్ చేశాడు. దీంతో చాలామంది నెటిజన్లు అతడిపై మండిపడ్డారు. ధ్రువ్ రాఠీ.. టీఎంసీ ప్రభుత్వానికి లొంగిపోయి ఆ పోస్టును డిలీట్ చేశాడంటూ ఆరోపించారు. ఆ తర్వాత ధ్రవ్ రాఠీ ఈ పోస్టు ఎందుకు డిలీట్ చేశానో వివరణ ఇచ్చాడు. డాక్టర్ హత్యాచారం కేసుకి నిర్భయ కేసుకి తేడాలున్నట్లు తన ఫాలోవర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని అందుకే డిలీట్ చేశానని చెప్పుకొచ్చాడు. తనను తాను సమర్థించుకున్నప్పటికీ.. ధ్రువ్ రాఠీ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. డాక్టర్ హత్యాచారానికి సంబంధించిన పోస్టుల్లో హ్యాస్‌ట్యాగ్‌తో పాటు బాధితురాలి పేరును కూడా ప్రస్తావించాడు. రేప్ బాధితురాలి పేరును బయటపెట్టడం చట్టవిరుద్ధం అంటూ నెటిజన్లు అతడిపై విమర్శలు చేస్తున్నారు. చట్టం ఏం చెబుతోంది. భారత్‌లో.. అత్యాచార బాధితురాలికి సంబంధించి సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలు పెట్టింది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం.. అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును బయటపెట్టకూడదు. బాధితురాలి బంధువుల అంగీకారంతో కూడా బయటపెట్టకూడదు. ఇలా అత్యాచారానికి గురైన బాధితురాలు, ఆమె కుటుంబం గౌరవానికి భంగం కలగకుండా రక్షించేందుకే ఇలా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇదిలాఉండగా.. కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ ఆస్పత్రిలో రాత్రి విధుల్లో ఉన్న ఓ మహిళా జూనియర్ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడటంతో గ్యాంగ్ రేప్ కూడా జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. #rape #west-bengal #dhruv-rathee #kolkata-doctor-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి