Congress: అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థులపై వీడని సస్పెన్స్ ఒకపక్క నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్నా ఇంకా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం మీద క్లారిటీ రాలేదు. అముఖ్యంగా కాంగ్రెస్ పట్టున్న అమేథీ, రాయ్‌బరేల్లీలో ఈసారి ఎవరు పోటీ చేయనున్నారనే విషయం సస్పెన్స్‌గానే ఉంది. By Manogna alamuru 02 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి National Congress: దేశంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదలైపోయింది. ఇప్పటికే రెండు దశలు ముగిసాయి కూడా. మరోవైపు చాలా స్థానాలకు నామినేషన్ల గుడువు రేపటితో ముగియనుంది. అయినప్పటికీ నేషనల్ కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేయనున్నారనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీకి రాలేదు. ఈ రెండు స్థానాలకు నామినేషన్ వేయాల్సిన గడువు రేపటితో ముగియనుంది. ఐదో దశలో ఈ నెల 20న అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఆ రెండు స్థానాల్లో ఎవరు? కాంగ్రెస్ కు కంచుకోటలుగా అమేథీ, రాయ్ బరేలీ. గత ఎన్నికల్లో అమేధీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాయ్‌బరేలీ సోనియా నియోజకవర్గం. ఈసారి ఎన్నికల్లో ఆమె పాలగొనడం లేదు. రాహుల్ గాంధీ ఇప్పటికే వాయనాడ్‌లో నామినేషన్ వేశారు.. అక్కడ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. ఇప్పుడు అమేధీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. రాహుల్‌గాంధీనే అమేథీ నుంచి కూడా పోటీలో ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన రాహుల్ మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయరని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరోవైపు రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకాగాంధీని బరిలోకి దింపొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. వీటి మీద కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. అందరూ అక్కడి నుంచే.. ఫిరోజ్‌గాంధీ నుంచి సంజయ్‌గాంధీ వరకు.. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అమేథీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఇది కాంగ్రెస్కకు కలిసి వచ్చే స్థానం. రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి వరుసగా లోక్‌సభకు ఎంపికవుతూనే వచ్చారు. కేవలం గత ఎన్నికల్లో మాత్రం స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అయితే అమేథీలో ఓడినా కేరళ వయనాడ్‌లో గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు రాహుల్‌గాంధీ. ఇప్పుడు కూడా అదే చేస్తారా..మళ్ళీ రాహుల్ గాంధీనే అమేధీ నుంచి పోటీ చేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఎవరు బరిలో నిలుస్తారనే దానిపై ఉత్కంఠ అయితే బిల్డప్ అవుతోంది. గత ఎన్నికలలాగే ఈసారి కూడా రాహుల్ రెండు చోట్లా పోటీ చేస్తారని ప్రచారం మాత్రం బాగా జరుగుతోంది. అలాగే అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోటీకి దిగుతారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గాంధీ కుటుంబానికి పెట్టని కోట.. ఇక గాంధీ కుటుంబానికి పెట్టని కోటలా ఉండే రాయ్‌బరేలీ స్థానంలో కూడా పోటీకి ఎవరు నిలబడతారు అనేది ఇప్పటి వరకు తేలలేదు. గత ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు సోనియాగాంధీ.ఈసారి అనారోగ్యం కారణంగా ఆమె ప్రత్యక్ష బరిలో నిలవలేనంటూ రాజ్యసభకు వెళ్ళిపోయారు.దీంతో ఇప్పుడు రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తారని చాలా రోజుల నుంచీ ప్రచారం జరుగుతున్నా కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఇప్పటి వరకు దాని గురించి ఏ ప్రకటనా చేయలేదు. అయితే మరోవైపు మాత్రం రేపటిలోగా రాహుల్, ప్రియాంక నామినేషన్లు దాఖలు చేస్తారని కూడా గట్టిగా వినిపిస్తోంది. ఐదవ దశలో.. ఈ నెల 20న ఐదవ దశలో యూపీలోని 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అమేథీ, రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్, లక్నో, ఫైజాబాద్, మోహన్‌లాల్‌గంజ్, జలౌన్, ఝాన్సీ, కౌశంబి, బారాబంకి, గోండా, హమీర్‌పూర్, బందా, ఫతేపూర్‌లలో పోలింగ్ నిర్వహించనున్నారు. Also Read:USA: తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష #congress #elections #raybareli #amethi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి