Kishan Reddy: ఆ రెండూ అవినీతి పత్రాలే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వేర్వేరు కాదు.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం, బీఆర్‌ఎస్‌ స్వేదపత్రం రెండూ అవినీతి పత్రాలేనన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి పాల్గొన్న ఆయన వాజ్‌పేయి దార్శనికతను కొనియాడారు. వాజ్‌పేయి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు కిషన్ రెడ్డి.

New Update
Kishan Reddy: ఆ రెండూ అవినీతి పత్రాలే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వేర్వేరు కాదు.. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

Kishan Reddy: కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం, బీఆర్‌ఎస్‌ స్వేదపత్రం రెండూ అవినీతి పత్రాలేనన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) జయంతి వేడుకల్లో ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రెండు పార్టీల విధానాలూ వేర్వేరు కాదన్నారు.  వాజ్‌పేయి దార్శనికతను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

ఆదర్శప్రాయుడు వాజ్‌పేయి:

ఒకే ఓటు తక్కువగా ఉన్నప్పటికీ విలువలకు కట్టుబడి ప్రధాని పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని, నైతిక విలువలతో వాజ్‌పేయి భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకుడిగా నిలిచారని వ్యాఖ్యానించారు. అయోధ్యంలో రామమందిర నిర్మాణంతో ఆయన కల ఇన్నాళ్లకు నెరవేరబోతోందన్నారు. ఆయన ప్రారంభించిన స్వర్ణచతుర్భుజి ప్రాజెక్టు ఫలితాలు ఇప్పటికీ అందుతున్నాయన్నారు. పాకిస్థాన్‌కు స్నేహహస్తం అందించిన వాజ్‌పేయీ ఆ దేశం తోకజాడించాలని చూస్తే కార్గిల్‌లో తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల్లో ఆదర్శప్రాయుడిగా నిలిచిన వాజ్‌పేయి జయంతిని కేంద్రప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: వ్యూహం మార్చిన పవర్ స్టార్.. భీమవరంతో పాటు ఆ సంచలన స్థానం నుంచి పోటీకి సై!

28న తెలంగాణకు అమిత్‌ షా:
డిసెంబర్‌ 28న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పర్యటన ఉంటుందని కిషన్‌ రెడ్డి తెలిపారు. మండలాధ్యక్షులు, ఆ పైస్థాయి నేతలతో అమిత్‌ షా సమావేశమవుతారని వెల్లడించారు. శంషాబాద్‌ల ఆయన సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, కార్యకర్తలకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని దీమా వ్యక్తంచేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు