వరల్డ్ కప్‌ను గెలిచే టీమ్ ఏది..! ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించిందా..? భారత పిచ్‌లపై కంగారు ఆటగాళ్లు ఎలా రాణిస్తారు..? భారత్‌లో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డ్ ఎలా ఉంది By Karthik 07 Aug 2023 in Uncategorized New Update షేర్ చేయండి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వన్డే వరల్డ్ కప్ జట్టును ప్రకటించిందా..? భారత పిచ్‌లపై కంగారు ఆటగాళ్లు ఎలా రాణిస్తారు..? భారత్‌లో ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రికార్డ్ ఎలా ఉంది..? వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఏ టీమ్‌కు ఉంది.. అందులో ఆస్ట్రేలియా ఉంటుందా..? క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు ఏమంటున్నారు. భారత్ వేదికగా 2023 వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు తలపడనున్నాయి. ర్యాంకింగ్ పరంగా టాప్ 8 టీమ్‌లు ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. మిగిన 2 టీమ్‌లు క్వాలీఫయర్ ద్వారా అర్హత సాధించాయి. టాప్ 8లో ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్ జట్లు నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించగా.. క్వాలీఫయర్ మ్యాచ్‌లు అడిన శ్రీలంక, నెదర్లాండ్ వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాయి. కాగా ఈ టోర్నీకి వెళ్లే టీమ్‌లపై ఆ దేశ బోర్డులు దృష్టి పెట్టాయి. ఎవరిని పంపితే మెగా టోర్నీలో సత్ఫలితాలు వస్తాయి, టీమ్‌లో ఒకరు విఫలమైతే ఆ బాధ్యతలను నెవవేర్చే ఆటగాడు ఎవరున్నారని వెతుకున్నాయి. భారత్ పిచ్‌లు ఉపఖండ దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ టీమ్‌లకు అలవాటే.. వాటిలో పాక్ టీమ్ భారత్‌లో పర్యటించక 10 సంవత్సరాలు కావస్తోంది. కాబట్టి పాక్‌కు భారత్ పిచ్‌లపై గ్రిప్ ఉండే అవకాశం లేదు. మరోవైపు గతంలో భారత్ 4 సార్లు వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించగా.. కంగారు టీమ్(1987, 2011) రెండు సార్లు టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మరోసారి ఇండియా వేదికగా జరుగుతున్న మెగా టోర్నీకి కంగారు ఆటగాళ్లు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత వరల్డ్ కప్‌లో దిగ్గజ బ్యాటర్లు ఆడమ్ గ్రిల్ క్ట్రిస్ట్, మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్, మైకెల్ క్లార్క్, ఆండ్రూ సైమెండ్స్, మిచ్చెల్ జాన్సన్, బ్రెట్‌లీ లాంటి ప్రమాదకరమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం కమిన్స్ నాయకత్వంలోని ఆసిస్ టీమ్ 18 మంది ఆటగాళ్లను ప్రకటించింది. ఈ టీమ్ కూడా బలంగానే ఉన్నా.. వరల్డ్ కప్‌లో గతంలో ఆటగాళ్లలా వీరి ఫామ్ లేకపోడం, భారత ప్రధాన ఆటగాళ్లు ఇప్పుడే ఫామ్ అందుకోవడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. స్వదేశంలో జరుగనున్న మహా సంగ్రామానికి బీసీసీఐ టీమ్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండా.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, హార్డిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్పీత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్, దినేష్ కార్తిక్‌తో పాటు ఆరంగేట్రం ప్లేయర్ ఒకరు ఎంపికయ్యే అవకాశం ఉందని మాజీ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇందులో వెస్టిండీస్ పర్యటనలో అదర గొడుతున్న ఆరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కాగా భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌లో సెమీస్‌కు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ టీమ్‌లు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఫైనల్ మాత్ర ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉంటుందని, భారత్ విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు #pakistan #england #india #australia #odi-world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి