Telangana: కొత్త పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడంటే ?

తెలంగాణలో కొత్త పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ టూర్‌పై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చే జరగలేదని తెలిపారు. మా శాఖలకు రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నామని పేర్కొన్నారు.

New Update
Telangana: కొత్త పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడంటే ?

Telangana: తెలంగాణలో కొత్త పీసీసీ, మంత్రివర్గ విస్తరణ అంశం ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో ఇప్పట్లో ఇవి లేనట్లే కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు కీలక మంత్రులు అధిష్ఠానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా ఢిల్లీ టూర్‌ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చే జరగలేదని తెలిపారు. మంత్రులమంతా ఢిల్లీలోనే ఉన్నామని.. మా శాఖలకు రావాల్సిన నిధుల కోసం కేంద్ర మంత్రులను కలుస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రంగంలోకి జీహెచ్‌ఎంసీ

అలాగే జులై 7తో పీసీసీగా నా పదవీకాలం ముగుస్తుందని.. అప్పటిలోగా సమర్థవంతుడైన నాయకుడిని పీసీసీ చీఫ్‌గా నియమించాలని హైకమాండ్‌ను కోరినట్లు చెప్పారు. అయితే ఈసారి పీసీసీ పదవి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి ఏ శాఖలు దక్కనున్నాయనే దానిపై కూడా పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే కొత్త పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణ జరగడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

Also Read: ముగిసిన ఉమ్మడి రాజధాని కాలపరిమితి.. వాటా కావాలంటున్న ఏపీ

Advertisment
తాజా కథనాలు