Rahul Gandhi: ఢిల్లీలో అధికారంలోకి రాగానే తొలిసంతకం దానిపైనే పెడతాం: రాహుల్

ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణనపైనే మొదటి సంతకం చేస్తామని ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల జనాభా ఎంత ఉందో తెలిస్తే.. వారి నిజమైన శక్తి అనేది బయటపడుతుందని.. దీనివల్ల దేశంలో గణనీయంగా మార్పు వస్తుందని అన్నారు

MP Rahul Gandhi: ఆగస్టు 15లోగా 30 లక్షల ఉద్యోగాలు.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన
New Update

దేశవ్యాప్తంగా కులగణన జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ కూడా కాంగ్రెస్ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టతనిచ్చారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే కులగణనపైనే తొలి సంతకం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తీసుకోనున్న అత్యంత విప్లవాత్మకమైన చర్యగా పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. కుల గణన సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: పీఎం పర్యటనలో బయటపడ్డ భద్రతా లోపం..కాన్వాయ్ కు అడ్డొచ్చిన మహిళ…!!

ఓబీసీలకు హక్కుులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు.. ఓబీసీలే లేరని బీజేపీ వాళ్లు చెబుతుంటారని.. ఓబీసీలు ఉన్నారని.. ఎంతమంది ఉన్నారనే విషయం తెలయాలని రాహుల్ అన్నారు. జనాభాలో ఓబీసీల పాత్ర ఎక్కువగా ఉందని.. ప్రధాని మోదీ చేసినా చేయకపోయినా ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల జనాభా ఎంత ఉందో తెలిస్తే.. వారి నిజమైన శక్తి అనేది బయటపడుతుందని.. దీనివల్ల దేశంలో గణనీయంగా మార్పు వస్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మహిళలందరికీ ఆర్థిక సాయం కింద వారి అకౌంట్లో ప్రతి ఏడాది రూ.15 వేలు జమ అవుతాయని తెలిపారు. అలాగే కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలనే నిర్ణయం తీసుకుందన్నామని పేర్కొన్నారు.

Also read: మధ్యప్రదేశ్, ఛత్తీస్‎గఢ్‎లో ముగిసిన ప్రచారం..ఎల్లుండే ఎన్నికలు.. ప్రస్తుత పరిస్థితి ఇదే..!!

#telugu-news #congress #rahul-gandhi #assembly-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe