Telangana politics:ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలకు పార్టీలన్నీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నాయి. ఫలితాలు ఎలా వచ్చినా ముందు వెళ్ళేలా ప్లాన్ బి, సిలు రెడీ చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే హంగ్ వస్తే ఏం చేయాలన్న దాని మీద కూడా కసరత్తులు చేస్తున్నాయి.

New Update
Telangana politics:ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

మరో మూడు వారాల్లో తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీని ముందర రాజకీయం చాలా మలుపులు తిరుగుతోంది. అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి బీఆర్ఎస్ కు మిగతా పార్టీలు గట్టిపోటీ ఇచ్చేట్టే కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టే పార్టీలన్ని ప్రచారాలు కూడా చేస్తున్నాయి. ప్రస్తుతానికి బీఆర్ఎస్ దే హవా కనిపిస్తున్నా...హంగ్ వచ్చే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఫలితాల తర్వాత పరిస్థితులు హంగ్ కు దారి తీస్తే ఏంటన్నదాని మీద కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడకుండా ఆగిపోదు కానీ..ఏఏ పార్టీలు కలిసి గవర్నమెంట్ ను ఏర్పాటు చేస్తాయన్నదే కీలకం.

Also read:ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

తెలంగాణలో మొత్తం 119 స్థానాలున్నాయి. ఇందులో బీఆర్ఎస్ కు 53 వచ్చినా చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయొచ్చు. దానికి కారణం ఆ పార్టీకి ఎమ్ఐఎమ్ అండగా ఉండడమే. మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ కు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏమడుగుతుంది అన్నది పక్కనపెడితే గవర్నమెంట్ ఏర్పడ్డానికి మాత్రం ఎప్పుడూ నో చెప్పదు. మజ్లిస్ కు ఆరు నుంచి ఏడు సీట్లు కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కు మ్యాజిక్ నంబర్ రాకపోతే ఎమ్ఐఎమ్ డెఫినిట్ గా కలుస్తుంది. అయితే ఇది ఆ పార్టీ 53 లేదా 54 సీట్లు సాధిస్తేనే.

ఒకవేళ మజ్లిస్ సపోర్ట్ సరిపోనంత తక్కువ బీఆర్ఎస్ కు సీట్లు వస్తే అప్పుడు ఏ పార్టీ కలుస్తుంది అనేది పెద్ద ప్రశ్న. కాంగ్రెస్, బీజేపీ...ఈరెండింటిలో చూసుకుంటే బీఆర్ఎస్, బీజేపీతోనే ఎక్కువ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా బీజేపీకి మజ్లిస్ కన్నా ఎక్కువ సీట్లు రావాలి. అప్పుడే అది కూడా సాధ్యం అవుతుంది. ఈ దిశగా బీజేపీ కసరత్తులు కూడా చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ కీలకనేత కేటీఆర్ మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. బీజేపీతో కలిసే ఛాన్సే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. తమ రెండు పార్టీల మధ్య అలాంటి ఒప్పందం ఏమీ లేదని చెబుతున్నారు. అలాంటిదే ఉంటే మేడిగడ్డ మీద బీజేపీ ఎందుకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. ఇదే కాకుండా ఎన్నికల ముందు వివిధ జిల్లాల పోలీస్ బాస్ లను, కమిషనర్లను మార్చేసింది బీజేపీ. నిజంగా తమతో రావాలనుకుంటే మా ఆఫీసర్లను ఎందుకు మార్చేస్తుందని కూడా అడుగుతున్నారు కేటీఆర్. అయితే ఎన్నికలకు ముందు  కానీ ఎన్నికల ఫలితాల ముందు చెప్పిన మాటలు తర్వాత తారుమారు అయిపోతాయని అంటున్నారు రాజకీయ పండితులు. ఫలితాల తర్వాత జరిగే రాజకీయాలు వేరేగా ఉంటాయని అంటున్నారు.

Also Read:గాజాలో దాడులు ఇజ్రాయెల్‌కు మంచిది కాదు-అమెరికా

ఇక తెలంగాణలో మరో పార్టీ కాంగ్రెస్ విషయానికి వస్తే...దీని విషయం ఏమీ తెలియడం లేదు. అసలు ప్లాన్ బీ గురించి ఆలోచిస్తోందో లేదో కూడా స్పష్టత లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అన్నీ సవ్యంగా జరిగే అధికారంలోకి వస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ తేడాలొస్తే మాత్రం కష్టమే. హంగ్ వచ్చినా బీఆర్ఎస్... కాంగ్రెస్ కలుస్తుందో లేదో డౌటే. ఒకవేళ అలా కనుక జరగకపోతే ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ ఉండే ఛాన్స్ లేకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్న నేతలు ఏదో ఒక పదవి ఉంటేనే ఉండేట్టు ఉన్నారు. ఏమీ లేకపోతే పార్టీనే వీడివెళ్ళిపోతారు అంటున్నారు.  కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు కూడా. లేకపోతే కష్టమవుతుందని అన్నట్టు మాట్లాడారు.

దీనిబట్టి చూస్తే హంగ్ వస్తే అన్ని పార్టీలకన్నా కాంగ్రెస్ కే అసలు పరీక్ష. అసలే గాల్లో దీపంలా ఉన్న ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది. ప్రతిపక్షంగా మరో ఐదేళ్ళు పోరాడ్డానికి ఆ పార్టీలో నాయకులు రెడీగా ఉండరు. అందుకే కాంగ్రెస్ పూర్తి మెజారిటీ తెచ్చుకోవాలని సర్వ ప్రయత్నాలూ చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు