Good Sleeping : మంచి నిద్ర కోసం ఎలాంటి దిండ్లను ఉపయోగించాలి?.. ఇలాంటివి వాడితే అనారోగ్యం తప్పదు

సౌకర్యవంతమైన మంచం మీద పడుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ దిండ్లు, ఎత్తుగా ఉన్న దిండుపై నిద్రించే అలవాటు ఉంటే మెడకు హాని, అందంపైనా ప్రభావం, చర్మంపై మొటిమలు, ముడతలతోపాటు వెన్నెముక సమస్యలతోపాటు ఆరోగ్యానికి హానికరమనిహెచ్చరిస్తున్నారు.

New Update
Good Sleeping : మంచి నిద్ర కోసం ఎలాంటి దిండ్లను ఉపయోగించాలి?.. ఇలాంటివి వాడితే అనారోగ్యం తప్పదు

Pillow : నిద్రపోయేటప్పుడు మెత్తని దిండు(Pillow) ను ఉపయోగించడం మంచిదే అయితే రెండు దిండ్లు, గట్టిగా ఉన్నవాటిని వాడితే అనేక ఆరోగ్య సమస్యలు(Health Diseases) వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. దిండ్లు ఎక్కువగా వేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఎత్తైన దిండుతో నిద్రిస్తే కలిగే దుష్ప్రభావాలు:

  • వైద్యులు ఎప్పుడూ సౌకర్యవంతమైన మంచం మీద పడుకోవాలని(Sleeping) సిఫార్సు చేస్తారు. ఎందుకంటే నిద్రించే సమయంలో శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చక్కగా నిద్రపోవచ్చు. కానీ కొంతమందికి ఎక్కువ దిండ్లు లేదా ఎత్తుగా ఉన్న దిండుపై నిద్రించే అలవాటు ఉంటుంది. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి ఎత్తైన దిండుతో నిద్రించడం వల్ల మెడకు హాని కలుగుతుంది.

ఎత్తుగా ఉన్న దిండ్లు వాడితే:

  • పెద్ద దిండ్లను వాడటం వల్ల భుజాలు, మెడ కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల మెడ నొప్పి(Neck Pain), దృఢత్వం వంటి సమస్యలు వస్తాయి. తల వెనుక భాగంలో కూడా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా దిండును ఎత్తుగా ఉంచి నిద్రించడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తాయి. శరీర ఆకృతిలో కూడా మార్పులు వస్తాయి. ఇంకా అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

అందంపైనా ప్రభావం:

  • ఎత్తైన దిండుతో నిద్రించడం వల్ల కూడా మీ అందంపైనా ప్రభావం పడుతుంది. ముఖం, దిండు మధ్య రాపిడి కారణంగా చర్మంపై మొటిమలు(Pimples), ముడతలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఎత్తైన దిండ్లను వేసుకుంటే తలనొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : ఈ ఒక్క పండును మీ చర్మం రష్మిక మందన్న లాగా మెరిసిపోతుంది!

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు