Allu Arjun : 'చెప్పను బ్రదర్'.. ఈ డైలాగే మెగా ఫ్యామిలీకి బన్నీని దూరం చేసిందా!? మా కల్యాణ్ బాబాయ్.. కల్యాణ్ బాబాయ్ అని గొప్పగా చెప్పుకునే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు. 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో ఆ పేరు 'చెప్పను బ్రదర్' అని ఎందుకన్నాడు? అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 15 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ సినిమా New Update షేర్ చేయండి Mega Family-Allu Arjun : 'పవన్‌ను టచ్ చేయాలంటే నన్ను దాటుకోని వెళ్లాలి..' ఇది దశాబ్ద కాలం క్రితం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోసం అల్లు అర్జున్ చేసిన కామెంట్. బన్నీకి పవన్‌కల్యాణ్ వరసకు మావయ్య అవుతాడు. అయినా బన్నీ మాత్రం ఎఫెక్షన్‌తో 'మా కల్యాణ్ బాబాయ్.. మా కల్యాణ్ బాబాయ్' అని ప్రతీ సినిమా ఫంక్షన్లో ఎంతో గొప్పగా చెప్పుకునేవాడు. పవన్‌పై ఎన్నోసార్లు రాజకీయంగా, వ్యక్తిగతంగా మాటల దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ అల్లు అర్జున్ అందరికంటే ముందుగా పవన్‌కు సపోర్ట్‌గా నిలిచేవాడు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్దీ బన్నీ మెగా కుటుంబానికి దూరం అవుతూ వచ్చాడు. ఇప్పుడదీ పీక్ స్టేజీకి చేరినట్టే కనిపిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవవ్ కల్యాణ్ ప్రమాణస్వీకారం రోజు సోషల్‌మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ మరోసారి రచ్చకెక్కింది. ఇంతకీ మెగా ఫ్యామిలీకి అల్లు కుటుంబానికి మధ్య ఎందుకీ గ్యాప్? అసలు కారణాలేంటి? 'చెప్పను బ్రదర్' అంటూ.. 2016లో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన 'సరైనోడు' బ్లాక్ బస్టర్ ఫంక్షన్ విజయవాడ (Vijayawada) లో జరిగింది. అప్పట్లో నడిచిన ఓ ట్రెండ్ గురించి మీకు గుర్తుండే ఉంటుంది. సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలో పవన్ ఫ్యాన్స్ 'పవర్ స్టార్ పవన్ స్టార్' అని నినాదాలు చేసేవారు. దీనిపై నాగబాబు సైతం అప్పట్లో చాలా సీరియస్ అయ్యారు. ఇటు 'సరైనోడు' సక్సెస్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతున్న సమయంలోనూ పవన్ ఫ్యాన్స్ ఇలానే నినాదాలు చేశారు. దీనికి కౌంటర్‌గా బన్నీ 'చెప్పను బ్రదర్' అని డైలాగ్ పేల్చాడు. ఈ ఒక్క మాటతో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా మారిపోయారు. స్వరం తగ్గించిన అల్లు అర్జున్.. అయితే ఈ 'చెప్పను బ్రదర్' డైలాగ్ తర్వాత కూడా పలు సందర్భాల్లో అల్లు అర్జున్ పవన్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. అటు రామ్‌చరణ్ (Ram Charan) తో ఎంతో స్నేహంగా మెలిగేవాడు బన్నీ. తర్వాత రెండు కుటుంబాల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ బన్నీ రూటే మారిపోయింది. గతంలో లాగా మెగా కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తే విషయంలో అల్లు అర్జున్ తన స్వరాన్ని తగ్గించాడు. ఇక ఇదే సమయంలో అల్లు అర్జున్ స్టార్డమ్ సైతం అమాంతం పెరిగిపోయింది. బన్నీకి సపరేట్ బ్రాండ్.. అల్లు అర్జున్ కెరీర్ తొలినాళ్లలో చిరంజీవి ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఆ కృతజ్ఞతా భావాన్ని అల్లు అర్జున్ అందరిముందు చూపించకుండా ఎప్పుడూ లేడు కూడా. అయితే ఇప్పుడు బన్నీకి సపరేట్ బ్రాండ్ ఏర్పడింది. ఐకాన్ స్టార్‌గా బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తెలుగు సినీ చరిత్రలో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరో కూడా అల్లు అర్జునే. బన్నీ టాలెంట్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేకున్నా కేవలం రాజకీయాల విషయంలోనే అల్లు అర్జున్ టార్గెట్‌గా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా.. 2024 ఏపీ ఎన్నికలకు (AP Elections 2024) ముందు పవన్‌కు సపోర్ట్‌గా ఓ ట్వీట్ చేశారు బన్నీ. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని బన్నీ మే 9, 2024న ట్వీట్ చేశాడు. అయితే మరుసటి రోజే నంద్యాల వైసీపీ ఎమ్మల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు ఇచ్చారు. ఆయన కోసం ఏకంగా ప్రచారం చేశారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి రవిచంద్రారెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. స్నేహారెడ్డికి శిల్పా కుటుంబంతో స్నేహం ఉండడంతోనే బన్నీ ఇలా చేశాడు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం బన్నీ చేసింది తప్పని మండిపడ్డారు. పవన్ కోసం మెగా కుటుండమంతా పిఠాపురానికి వెళ్తే బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లారని విపరీతంగా ట్రోల్ చేశారు. సాయిధారమ్ తేజ్ అన్‌ఫాలో.. తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పని చేసేవాడు తమ వాడైనా పరాయివాడేనని ఎన్నికల పోలింగ్‌కు ముందు మెగా బ్రదర్ నాగబాబు ఓ ట్వీట్ పెట్టారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. దీంతో నాగబాటు తన ట్వీట్‌ను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మెగా వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ యుద్ధం కొనసాగింది. మంత్రిగా పవన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సాయిధారమ్ తేజ్ బన్నీని సోషల్‌మీడియా అకౌంట్స్‌లో అన్‌ఫాలో కొట్టాడు. దీంతో ఈ రచ్చ మరింత ముదిరింది. అదే సమయంలో పుష్ప-2 సినిమా పోస్ట్‌పోన్ అవున్నట్టు నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడం పెను దుమారాన్ని రేపింది. Also Read : పాపం టీమ్ పాకిస్థాన్..ఈ కష్టం పగోడికి కూడా రావద్దు.. #allu-arjun #pawan-kalyan #mega-family మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి