Pakistan : పాక్ క్రికెట్ టీమ్‌కు, కష్టాలకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, గత ఏడాది కాలంగా ఈ టీమ్‌కు ఒకదాని తర్వాత మరొకటి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం జట్టు పేలవ ప్రదర్శన. గతేడాది జరిగిన ఆసియాకప్ నుంచి మొదలైన పాక్ జట్టు కష్టాల పరంపర ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు, అలాంటి కొత్త సమస్య పాకిస్తాన్ జట్టు మెడకు చుట్టుకుంది, T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup 2024) లో USA, టీమిండియా (Team India) లపై దారుణ ఆటతీరు ప్రదర్శించడంతో బాబర్ జట్టుపై పాకిస్తాన్లో దేశద్రోహం కేసు నమోదైంది.
పూర్తిగా చదవండి..Pakistan Cricket Team : పాపం టీమ్ పాకిస్థాన్.. ఈ కష్టం పగోడికి కూడా రావద్దు..
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. వరల్డ్ కప్ పోటీలలో పసికూన అమెరికా, భారత్ లపై ఓటమి.. పాక్ టీమ్ ను పెద్ద ఆపదలోకి నెట్టేశాయి. మొత్తం పాక్ టీమ్ పై వారి దేశంలో దేశద్రోహం కేసు పెట్టాడు ఒక లాయర్. డబ్బుకోసం దేశాన్ని పణంగా పెట్టారని ఆ లాయర్ ఆరోపించాడు.
Translate this News: