ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే.. అసలు ఇంతకీ ఆర్-5 జోన్ అంటే ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తోనే ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజా రాజధాని కావాలంటే..

అమరావతి అసైన్డ్ భూముల కేసు: సీఐడీ కీలక వాదనలు
New Update

R-5 zone in Amaravati: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి(AP Govt) షాక్ ఇచ్చింది హైకోర్టు. ఆర్-5 జోన్ లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై గురువారం జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.

ఈ వివాదానికి కారణం:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court), రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తోనే ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ (CRDA) చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజా రాజధాని కావాలంటే ప్రజలు నివసించడానికి ఇళ్ల స్థలాలు ఇస్తే తప్పేంటన్న కోణంలో.. ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చింది జగన్ సర్కార్. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

అలాగే అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో కూడా ఈ మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్-5 జోన్ పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించడానికి కేవలం 15 రోజుల గడువు ఇచ్చింది. దీంతో ఈ గెజిట్ నోటిఫికేషన్ పై కొందరు హైకోర్టు కవెళ్లారు. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన 28 వేల మందికి ప్రస్తుతం ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాలను కేటాయించింది. దీంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విషయంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం మూడో కంటికి తెలియకుండా సీఆర్డీఏ చట్టంలో సవరణలు చేసింది. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి.

ఆర్-5 జోన్లు ఇవే(R-5 zone in Amaravati):

ఆర్‌-1 అంటే.. ప్రస్తుత గ్రామాలు.

ఆర్‌-2 అంటే తక్కువ సాంద్రత గృహాలు.

ఆర్‌-3 అంటే తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు.

ఆర్‌-4 అంటే హైడెన్సిటీ జోన్‌ పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి.

ఆర్‌-5 కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ గా ఏర్పాటు చేసింది.

#andhra-pradesh #ap-news #latest-news #amaravati #andhra-padesh-government #r-5-zone #ap-high
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe