G20 Summit: ప్రపంచం చూపు భారత్ వైపు.. జీ20 సమావేశాల ఎజెండా ఏమిటి..?

ఢిల్లీ వేదికగా నిర్వహించే G20 సమ్మిట్‌లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏ ఏ వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, ఉక్రెయిన్‌ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి.

G20 Summit: ప్రపంచం చూపు భారత్ వైపు.. జీ20 సమావేశాల ఎజెండా ఏమిటి..?
New Update

Agenda of G20 Summit:  సరిహద్దులు, భాషాభేదాలు, భావజాలాలకు అతీతంగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకే కుటుంబంగా పురోభివృద్ధి చెందడమే G-20 (G20 Summit) ముందున్న లక్ష్యం. పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంబించాలని జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిస్తున్నాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు కోరుకుంటోంది. ‘లైఫ్‌’తోనే శుద్ధ, పర్యావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమని జీ20 కూటమి భావిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలో చాలా పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా మూడు అంశాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్థూలదేశీయోత్పత్తి అంటే జీడీపీ, చైన్‌ సప్లై, దేశాల మధ్య విశ్వసనీయతను ప్రపంచం గుర్తిస్తోంది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అవశ్యకత, మరిన్ని దేశాల ప్రాతినిధ్యం పెంచడం వంటి అంశాల్లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

The Theme of India’s G20 Presidency - “Vasudhaiva Kutumbakam” or “One Earth · One Family · One Future”

G20 సమ్మిట్‌లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు..?

ఢిల్లీ వేదికగా నిర్వహించే G20 సమ్మిట్‌లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏ ఏ వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, ఉక్రెయిన్‌ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి. సదస్సులో భాగంగా విచ్చేసే దేశాధినేతలు విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు, ఉమ్మడి ప్రణాళికలు చేసుకునేందుకు చక్కని అవకాశం దక్కనుంది. ఇది ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతో దోహదపడనుంది.

Also Read: జీ20 సమావేశాలు జరిగే భారత్‌ మండపం స్పెషాలిటీ ఏంటి? వైరల్‌ ఫొటోలు, వీడిమోలు!

19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమే జీ20..

19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమే జీ20. ప్రపంచం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది. G20ను మినీ ఐక్యరాజ్యసమితిగా అభివర్ణించవచ్చు. 2008లో ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో పరస్పర సహకారం కోసం జీ20 ఏర్పాటైంది. జీ 20కు ఓ నిర్దిష్ట కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ అంటూ ఉండవు. ఒక్కో ఏడాది ఒక్కో దేశం సారథ్య బాధ్యతలు వహిస్తాయి. సారథ్య బాధ్యతలు తీసుకున్న దేశంలో ఆ ఏడాది సమ్మిట్‌ జరుగుతుంది. 2020లో సౌదీ అరేబియా, 2021లో ఇటలీ, 2022లో ఇండోనేషియాలు జీ 20 సారథ్య బాధ్యతలు నిర్వహించాయి. ఈ ఏడాది ఆ అవకాశం భారత్‌కు దక్కింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. వచ్చే ఏడాది జి-20 బాధ్యతలను బ్రెజిల్ తీసుకోనుంది.

G-20 సమ్మిట్‌కు జో బైడెన్‌ దూరం!

మరోవైపు G-20 సమ్మిట్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దూరం కానున్నట్లు తెలుస్తోంది. శ్వేతసౌధంలో కరోనా కలకలం రేపుతోంది. అమెరికా ఫస్ట్‌ లేడీ జిల్‌ బైడెన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే కోవిడ్‌ టెస్టుల్లో బైడన్‌కు మాత్రం నెగిటివ్‌ వచ్చింది. బైడెన్‌కు మరోసారి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. భారత్‌, వియత్నాల్లో బైడెన్‌ పర్యటన షెడ్యూల్‌లో మార్పు లేదన్న శ్వేతసౌధం అధికారులు చెబుతున్నారు. బైడెన్‌ పర్యటన నేపథ్యంలో G-20 దేశాధినేతలు ఆందోళనలో ఉన్నారు.

ఇది కూడా చదవండి: జీ20 సమావేశాలు జరిగే భారత్‌ మండపం స్పెషాలిటీ ఏంటి?

#delhi #g20-summit-2023 #america #india #jo-biden #g20-summit-2023-delhi #g20summitdelhi #g20summit #agenda-of-g20-summit #agenda-of-g20-summit-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe